పేదలకు కూడా ఇంటివద్దకే వైద్యసేవలు అందించాలి



నెల్లూరు, జనవరి 12 (ప్రజా అమరావతి): పేదలకు కూడా ఇంటివద్దకే వైద్యసేవలు అందించాల


నే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

శుక్రవారం ఉదయం మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో రూ.17.50 లక్షలతో నిర్మించనున్న డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ ను మంత్రి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేవలం ధనికులకు మాత్రమే సాధ్యమయ్యే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పేదలకు కూడా అందించాలనే లక్ష్యంతో కుటుంబ డాక్టర్ పద్ధతిని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యుడు  ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసి మెరుగైన వైద్య చికిత్సలు సకాలంలో అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ విలేజ్ క్లినిక్ లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎన్ ఎస్ ఆర్ ఫౌండేషన్ ను స్థాపించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎర్ర తివాచీ పరుస్తూ, అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేస్తుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి అనేక వృత్తి నైపుణ్య కోర్సులను అందిస్తుందన్నారు. యువత మంచి వృత్తి నైపుణ్యాన్ని సాధించి అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. 

అనంతరం ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ లోగోను మంత్రి ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి సురేష్ కుమార్, ఎంపీపీ జి వజ్రమ్మ, సర్పంచ్ నారపరెడ్డి జాంబవతి, ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments