జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు నిర్మించడానికి స్థల సేకరణ: జిల్లా కలెక్టర్

 జిల్లాలో  ప్రభుత్వ కార్యాలయాలకు  నిర్మించడానికి స్థల సేకరణ:  జిల్లా కలెక్టర్




పుట్టపర్తి, జనవరి 19 (ప్రజా అమరావతి):  నూతన జిల్లాలో  వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో  నిర్మించడానికి  స్థల సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్   సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములను  గుర్తించడానికి జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.   ఏనుములపల్లి గ్రామం నందు  ప్రభుత్వ భూములను గుర్తించారు , పేరడ గ్రౌండ్ నందు ప్రభుత్వ భూములను పరిశీలించారు. పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో  నిరుపయోగంగా ఉన్న  ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను పరిశీలించారు. గణేష్ సర్కిల్ సమీపమున ఉన్న షాది ఖాన్ దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి 11 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం నూతన జిల్లాలో వివిధ భవన నిర్మాణాలు నిర్మించడానికి, రెడ్ క్రాస్ సొసైటీ భవనము, రైతు బజారు,  స్కిల్ డెవలప్మెంట్ భవనం, టూరిజం  భవన నిర్మాణం, తదితర  భవన నిర్మాణం పనులు నిర్మించడానికి స్థల సేకరణ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సంబంధించిన  పేరడే గ్రౌండ్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రామకృష్ణ ప్రసాద్, తాసిల్దార్ నవీన్ కుమార్,   పుడా  విసి  నరేష్ కృష్ణ,  రెడ్ క్రాస్ సొసైటీ  అధికారివిశ్వనాధ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఖయ్యూం, డిఎంహెచ్ఓ ఎస్ వి కృష్ణారెడ్డి, పుట్టపర్తి  మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి,  సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments