చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్.. పవన్ కళ్యాణ్ ఫైర్..

 చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్.. పవన్ కళ్యాణ్ ఫైర్..


శ్రీకాకుళం (ప్రజా అమరావతి);

తన చివరి శ్వాస వరకు రాజకీయాలకు వదిలిపెట్టనని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఏర్పాటు చేసిన జనసేన యువశక్తి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్..


మనల్ని ఎవర్రా ఆపేది అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తనను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనేవారికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. అసలు దేశంలో ఎవరైనా ఫుల్ టైమ్ పొలిటీషియన్ ఉన్నారా ?


అని ప్రశ్నించారు. చాలామంది వ్యాపారాలు, తమ వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయాలు చేస్తున్నారని గుర్తు చేశారు. తాను కూడా అలాగే చేస్తున్నానని అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకపోతే ఇలాంటి వారితో తిట్లు తినాల్సిన అవసరం లేదని..


అప్పుడు తనతో ఫోటోలు దిగే వాళ్లు మాత్రమే ఉంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసమే తాను పలువురు నేతలతో తిట్లు తింటున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతున్న వారు..


అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ డిమాండ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఈసారి జనసేనకు అండగా లేకపోతే వారికి ఎవరూ కాపాడలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. మాట్లాడితే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారని.. తాను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఎవరూ తట్టుకోలేరని అన్నారు. తనను మళ్లీ ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే జనసేన కార్యకర్తల చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర సహా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తమకు అధికారంలోకి రావాలని చెప్పారు.

Comments