ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన pac చైర్మన్ నాదెండ్ల. మనోహర్

  తెనాలి (ప్రజా అమరావతి);


 తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన pac చైర్మన్ నాదెండ్ల. మనోహర్



ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్న మనోహర్.


ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న మనోహర్.


ప్రభుత్వ  ఆసుపత్రిలో పనిచేయని  సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని  వైద్య సిబ్బందిని ప్రశ్నించిన  మనోహర్.


ఎక్కువ శాతం రోగులను ఇక్కడ ట్రీట్మెంట్ చెయ్యకుండా గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రభుత్వ  ఆసుపత్రిలో ఇంకా సేవలు మెరుగుపరచాలని వైద్యులకు పలు సూచనలు చేసిన మనోహర్.



రోగుల దగ్గరకు వెళ్లి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా వైధ్యం  అందుతుందా అని ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఏమర్జన్సీ నుంచి ఐసీయూ విభాగంవరకు వెళ్లి చూసారు.


బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఎందుకు తక్కువ ఉన్నాయి మాకు చెబితే మేము బ్లడ్ డోనేషన్ క్యాంపులు పెట్టి మీకు బ్లడ్ పంపుతాము అని వైద్యులకు తెలిపిన మనోహర్.  ప్రభుత్వ  ఆసుపత్రిలో స్కాన్ మిషన్లు పనిచెయ్యక బ్లడ్ కొరతలు ఉండి  పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా అని వైద్యులను ప్రశ్నించిన మనోహర్.


ఈ సందర్భంగా మనోహర్ మీడియా తో మాట్లాడుతూ -


చాలా రోజుల తరువాత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు సందర్శించటం జరిగింది.


ఆసుపత్రిలో వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు.


గతంలో నేను నిధులు తీసుకువచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాము ఇప్పటి ప్రభుత్వాలు వాటికి నిధులు ఇచ్చి మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చెయ్యాలి.


ప్రభుత్వం పేదలకు అందించే వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.


గతంలో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 12 వందల మంది రోగులు వచ్చేవారు కానీ ఇప్పుడు 5వందల మంది మాత్రమే రోగులు వస్తున్నారు .


ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలి.


ఆసుపత్రిలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉండటాన్ని గమనించాను.


ఇతర ప్రాంతాలనుంచి వస్తున్నారు అక్కడే ఇంకా మెరుగైన సేవలు ఎందుకు చెయ్యటం లేదు బ్లడ్ కావాలి అంటే జనసేన బ్లడ్ క్యాంప్ లు పెట్టి బ్లడ్ అందిస్తాము.


ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వైద్య సిబ్బంది పై తీవ్ర వత్తిడి ఉంటుంది


ప్రభుత్వం పేదల వైద్య సేవలపై పారదర్శకంగా వ్యవహరించాలి .


స్కాన్ సేవలు నిలుపుదల చేశారు ప్రభుత్వ పెద్దలు నిధులు ఇచ్చి సిటీ స్కాన్ సేవలో పేదలకు అందుబాటులోకి తీసుకురావాలి.


కోవిడ్ సమయంలో  వైద్యులు,సిబ్బంది మెరుగైన సేవలు అందించారు.


రాబోయే రోజుల్లో తెనాలి వైద్యశాల కు జనసేన తరుపున తనవంతు కృషి అందిస్తానని తెలిపారు.

Comments