రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
మంగళవారం స్థానిక ఆనం కళకేంద్రం నందు ఆశా దినోత్సవం సందర్భంగా డి ఎం హెచ్ ఓ డా. కే .వెంకటేశ్వర్రావు అధ్యక్షతన అర్బన్ సెంటర్ నందు ఉన్న ఏఎన్ఎం లకు, ఆశా కార్యకర్తలకు వైద్యాధికారులకు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
వార్డు సచివాలయం నందు పనిచేయుచున్న అర్బన్ హెల్త్ సెంటర్ అడ్మిన్ సెంటర్ వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మెడికల్ ఆఫీసర్ లతో సమన్వయ మీటింగు నిర్వహించగా జరిగింది.
ఈ కార్యక్రమంలో డా. కె. వెంకటేశ్వరావు మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ నందు జరుగు ఆరోగ్య సేవలను 100 శాతం పూర్తి చేయాల
ని గర్భిణీ సేవలు ప్రమాద స్థితిలో ఉన్న గర్భిణీ సురక్షిత ప్రసవం కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలియ పరిచారు. ప్రమాద స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీని ముందుగానే ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా జాయిన్ చేయించాలని అన్ని వైద్య పరీక్షలు చేయించాలని అంగన్వాడీ కేంద్రం నందు ఏర్పాటు చేయబడిన పోషకాలను, ఐరన్ మాత్రలు వినియోగించడం వంటి విషయాల ఎప్పటికప్పుడు గర్భిణీలకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆశ నోడల్ పర్సన్ అర్జున్ మాట్లాడుతూ కిల్కారి మొబైల్ అకాడమీ గురించి ఆశ కార్యకర్తలకు ఏఎన్ఎం లకు అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ రిజిస్ట్రేషన్ సమయంలో ఫోన్ నెంబర్ , గర్భిణీ వారి ఇంటివారిని గాని మాత్రమే రిజిస్ట్రేషన్ లో నమోదు చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో PCPNDT Act చట్టం గురించి ఎంపీహెచ్వో డా. నాగు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ సెంటర్ డాక్టర్ ప్రసన్న , డాక్టర్ మనోజ్ కుమార్ , ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment