జగనన్నకు చెపుదాం (స్పందన) కార్యక్రమానికి 110 వినతులు
లాగిన్ లో వెంటనే చూడాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి):: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెపుదాం ( స్పందన) కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 110 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 82
ఉన్నాయి. హౌసింగ్ కు 07, మున్సిపల్ శాఖ కు 02, మిగిలినవి ఇతర శాఖలకు చెందిన వినతులు . పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జె.సి మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. స్పందన లో అందిన వినతులు పెండింగ్ పెట్టకుండా గడువు లోగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
addComments
Post a Comment