*ఈ నెల 27న వేలేరు మండలానికి కేటీఆర్ రాక*
*133 కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు*
*భారీ బహిరంగ సభకు ఏర్పాట్ల పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష*
*పర్యటన విజయవంతం కోసం మండలాల వారీగా ఇంఛార్జీ ల నియామకం*
*కార్యక్రమ సమన్వయ కర్తలు గా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య*
వరంగల్, హనుమకొండ, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి):
ఈ నెల 27 న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ల మంత్రి కల్వ కుంట్ల తారక రామారావు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని వేలేరు మండలానికి రానున్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత ఎత్తైన గ్రామాలకు సాగునీరు అందించడం కోసం తెలంగాణ అపర భగీరధుడు , తెలంగాణ జాతిపిత , సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు అయిన ఇరిగేషన్ ప్రాజెక్టుకు గౌరవ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ పర్యటన విజయవంతం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ - హనుమకొండ లోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, zp చైర్మన్లు సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తీవ్ర కరువుతో కొట్టు మిట్టాడుతున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ, ప్రత్యేకించి వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టు కు సీఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం, మంత్రి ktr గారి చొరవతో నిధులు మంజూరు అవడం, దానికి శంకుస్థాపన చేయడానికి కేటీఆర్ రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. మంత్రి ktr రాక సందర్భంగా, ఆ పర్యటన విజయవంతం కోసం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా, శంకుస్థాపన ప్రదేశం , బహిరంగ సభ నిర్వహణ దాని కోసం జన సమీకరణ తదితర అంశాలపై మంత్రి వారితో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయా విభాగాల వారీగా ఇంచార్జీ లను నియమించారు. అలాగే మండలాల వారీగా ఇంచార్జీ లను నియమించారు.
*మండలాల వారీగా ఇంచార్జీ లు:*
జాఫర్ గడ్ మార్నెని రవీందర్ రావు
స్టేషన్ ఘన్ పూర్ : ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
రఘునాథ పల్లి - రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు
లింగాల ఘనపురం : అర్ అండ్ బి అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్
ధర్మ సాగర్ : కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
వెలేరు : దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి
చిల్పూర్ : జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి
భీమ దేవరపల్లి : హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్
కాగా, *కార్యక్రమ సమన్వయ కర్తలు గా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య* లు వ్యవహరిస్తారు.
addComments
Post a Comment