దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రస్థాయి అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ ఏర్పాటు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా


విజయవాడ (ప్రజా అమరావతి);

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రస్థాయి అటల్ టింకరింగ్ ల్యాబ్ హబ్ ఏర్పాటు




- విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ఆవిష్కరణలు సృష్టించాలి

పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు

పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ రాష్ట్ర హబ్ &  ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం


విద్యార్థులు, ఉపాధ్యాయలు అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL)లను సద్వినియోగ పరచుకుని, తద్వారా వినూత్న ప్రయోగాలతో, కొత్త ఆవిష్కరణలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు అన్నారు. 

బుధవారం కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజ్ఞానాశ్రమ్ సాంకేతిక సహాయంతో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అటల్ టింకరింగ్ ల్యాబ్ రాష్ట్ర హబ్ &  ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించారు. దాదాపు 12 లక్షల  విలువ గల ఈ హబ్ లో ఉత్తమ మైన త్రీడీ ప్రింటర్, మెకానికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్, రోబోటిక్స్,  కుట్టు మిషన్ వంటివి  ఏర్పాటు చేశారు.

 ఈ సందర్భంగా కమీషనర్, ఎస్పీడీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ... భారతదేశంలోనే  మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి హబ్ ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ స్టేట్ హబ్ లో ఇది వరకే పాఠశాలల్లో ఉన్న 713 అటల్ టింకరింగ్ ల్యాబ్ లకు ట్రైనింగ్ సెంటరుగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఏడాదికి యూనిసెఫ్ రాష్ట్రంలో హబ్ 30 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఒక్కో హబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ కింద 5 స్పోక్స్ (స్కూళ్లు) అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ 30 హబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్లకు స్టేట్ హబ్ ట్రైనింగ్ సెంటర్లో ప్రతి నెలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ శేషగిరి మధుసూధన్, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి తెహరా సుల్తానా, మండల విద్యాశాఖాధికారి కనకమహాలక్ష్మి, పాఠశాల హెచ్ ఎం వై.డి.భవానీ, యూనిసెఫ్ ప్రతినిధులు సుదర్శన్, ప్రియాంక, స్వాతిదేవ్, ఎస్సీఈఆర్టీ స్టేట్ నోడల్ ఆఫీసర్ భాగ్యశ్రీ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైన్స్ అధికారులు జాకీర్ హుస్సేన్, హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఏర్పాటు

ఇందులో భాగంగా పాటు కెనరా బ్యాంకు  (విజయవాడ) వారు పాఠశాలలో విద్యుత్ సౌకర్యం అందించేందుకు గాను ఏర్పాటు చేసిన రూ. 4,63,000 విలువ చేసే సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ను కమీషనర్ గారు ప్రారంభించారు. 







Comments