నెల్లూరు, ఫిబ్రవరి 1 (ప్రజా అమరావతి): సుమారు మూడేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజల ముంగిటకు వెళుతున్న తమకు, ప్రజలు ఎదురేగి నీరాజనాలు పలుకుతున్నార
ని, ఇదే తమ ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామ సచివాలయం పరిధిలో రెండో రోజు ఎర్రగుంట గ్రామంలోని సరస్వతి నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్ళిన మంత్రి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఎర్రగుంట గ్రామంలోని సుమారు 11 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల నుంచి 12 లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, తాటిపర్తి పెంచలమ్మ కుటుంబానికి సుమారు 12 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని, ఇలా ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడేందుకు సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. గతంలో ప్రజల ముందుకు వెళితే అనేక వినతి పత్రాలతో తమను చుట్టుముట్టేవారని, తమ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించామని, ఇంకా అవసరమైన పనులను కూడా చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను చేపడుతూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎర్రగుంట గ్రామాన్ని గ్రామపంచాయతీ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుస్మిత, స్థానిక నాయకులు మందల వెంకట శేషయ్య, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment