ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలులో నూరు శాతం ప్రగతి సాధించాలి -- కలెక్టర్ మాధవీలతరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


* లక్ష్యాలను సాధించడానికి  పూర్తి సహకారం అందిస్తాం 


* ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలులో నూరు శాతం ప్రగతి సాధించాలి


-- కలెక్టర్ మాధవీలత
రెవెన్యూ సంబంధ భూ రీ సర్వే కు చెందిన అర్జీల పరిష్కారం కోసం ఆర్డీవో ల ద్వారా గత 20 రోజులుగా జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ, సమస్యలు పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు.గురువారం విజయవాడ లోని ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  , స్పెషల్ సి ఎస్ జి. సాయి ప్రసాద్, సి సి ఎల్ ఏ  కమిషనర్ సిద్ధార్థ జైన్,  కార్యదర్శి ఎండి. ఇంతియాజ్, తదితరులు వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు.

రీ సర్వే, భూ సేకరణ జాతీయ రహదారుల మరియు ఇండ్ల స్థలాలు, రెవెన్యూ సంబంధ స్పందన అర్జీలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు పై విసి నిర్వహించిన విసి కి స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ,  ప్రతి శాఖపై పదిహేను రోజుల ప్రగతి పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న దృష్ట్యా ఆ నాటికి మేరకు లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆరోజు మీకు నిర్దేశించిన ప్రగతి సాధించాలని అన్నారు. సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం అధికారులకు మద్దతుగా ఉంటామని అన్నారు. జిల్లాలో సర్వే పనులను వేగవంతం చేయడం తో పాటు క్షేత్ర స్థాయి లో పర్యటించి ఎటువంటి తప్పులకు తావులేకుండా దిశా నిర్దేశనం చేస్తున్నట్లు తెలిపారు. ఫేజ్ -1 లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం జరిగిందని అన్నారు. రెవెన్యూ సంబంధ స్పందన అర్జీల పరిష్కారం కోసం ఆర్డీవో ల ఆధ్వర్యంలో గత 20 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేస్తూ న్నట్లు పేర్కొన్నారు.  జిల్లాలో జాతీయ రహదారులు, ప్రాజెక్ట్ లకు సంబంధించి 142 హెక్టర్లలో భూ సేకరణ పనులు చేయడం జరుగుతోందని తెలిపారు.వ్యవసాయ అనుబంధ అంశంపై వివరాలు తెలుపుతూ, 131558 ఎకరాలకు గాను 127989 ఎకరాలు ఈ క్రాప్ నమోదు చేయడం జరిగిందని, 46 శాతం మంది రైతు లకు చెందిన డేటా    మ్యాపింగ్ చేసినట్లు మాధవీలత పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఉన్న 367 అర్భికే లలో 322 (88%) సంతృప్తి స్థాయి లో సేవలు అందిస్తున్నయాని, రాష్ట్రం లో ప్రథమ స్థాయి లో నిలిచామన్నారు.  మిగిలిన 45 కేంద్రాలలో మెరుగైన సేవలు అందించే సామర్థ్యం పెంచేందుకు సిబ్బందిని అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. మైక్రో ఇరిగేషన్ కింద 2 వేల హెక్టార్ల లక్ష్యం కుగాను 1637 హెక్టర్ లతో పాటు అందనంగా నిర్దేశించిన 3948 హెక్టర్ల కు గానూ 3294 మేర లక్ష్యాలను సాధించి నట్లు తెలియ చేసారు. మినీ ఫిష్ రిటైల్ రంగంలో భాగంగా జిల్లాకు కేటాయించిన 266 యూనిట్స్ కి గాను 136 యూనిట్స్ ఏర్పాటు చేసి నట్లు మాధవీలత తెలిపారు.  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 21 యూనిట్స్ కి గాను 20 యూనిట్స్ ఏర్పాటు చేశామన్నారు.హౌసింగ్ పై కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో గత వి సి నుంచి ఈరోజుకీ 3,054 ఇళ్ళ నిర్మాణాల్లో ప్రగతి చూపడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇళ్ళ నిర్మాణాల ప్రగతి లో ఉన్న వాటికి చెల్లింపులు జరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచడం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమం తో పాటు క్షేత్ర స్థాయి పర్యటన లో లబ్దిదారులకు ముఖాముఖి మాట్లాడడం జరుగుతోందన్నారు. జిల్లాలో పూర్తి అయిన 13,019 ఇళ్లకు విద్యుత్, త్రాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.  ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 6275 ఇళ్లకు గాను 6182 పూర్తి చేశామన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్ ఓ జీ. నరసింహులు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు పశుసంవర్ధక  డా ఎస్ జి టి సత్య గోవింద్, వ్యవసాయ అధికారి  ఎస్. మాధవ రావు, మైక్రో ఇరిగేషన్ అధికారి ఎస్. రామ్ మోహన్,   హార్టికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, గ్రామీణ నీటి సరఫరా అధికారి డి. బాల శంకర్, మత్స్య అధికారి  వి. కృష్ణా రావు, టిడ్కో అధికారి పి. రీటా, హౌసింగ్ అధికారి జీ.  పరుశరాం, తదితరులు పాల్గొన్నారు.Comments