క్యాన్సర్ ను తరిమి వేద్దాం

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


 క్యాన్సర్ ను తరిమి వేద్దాం 



** అవగాహన కలిగి ఉండడం వల్ల క్యాన్సర్ ను నివారించడం సాధ్యం


** డెల్టా ఆసుపత్రి యాజమాన్యం చొరవ అభినందనీయం


*క్రమం తప్పకుండా మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం జీవన విధానం లో భాగం అవ్వాలి 


- హోం మంత్రి డా తానేటి వనిత  

- జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత 


యాంత్రికమైన జీవన శైలి విడనాడి ఆరోగ్యవంతమైన జీవన విధానం, నిర్దేశిత పరీక్షలు ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండగలుగుతామని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం  స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు డెల్టా ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించిన " 2 కె రన్  " లో హోం మంత్రి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ, క్రమబద్దకరమైన వ్యాయామ శైలి కి అలవాటు పడాలని, ప్రతి రోజూ ఉదయం పూట వ్యాయామం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువగా మహిళల్లో బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడం జరుగుతోందని అన్నారు.  మంచి అలవాట్ల వల్ల క్యాన్సర్ రాకుండా నివారించడం సాధ్యం కాని వంశ పారంపర్యంగా వొచ్చే వారి విషయంలో మనో ధైర్యం తో ఉండాలన్నారు. క్యాన్సర్ ను సరైన సమయం లో గుర్తించ గలిగి వైద్యం పొందడం వల్ల చికిత్స చేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ ను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న వైద్య పరీక్షలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకోవడం చాలా అవసరం అన్నారు. జంక్ ఫుడ్స్ తినడం మానివేయడం ద్వారా ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు తో ఆరోగ్యము పొందడం సాధ్యం అవుతుందని మంత్రి వనిత అన్నారు. మనం, మన తో మన పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం ఆరోగ్య వంతమైన బిడ్డలను సమాజానికి అందించడం సాధ్యం అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లల్లోనే షుగర్, బిపి వంటి లక్షణాలు కనిపిస్తున్నయని, ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. 


జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, క్యాన్సర్ ను ముందస్తు గా గుర్తించడం ఎలా, అందుకు ఏ విధమైన పరీక్షలు చేసుకోవాలి, క్యాన్సర్ వచ్చే వారిలో గుర్తించదగిన లక్షణాలు పై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. "చికిత్స కంటే నివారణ" ముఖ్యం అన్న సూక్తి ని కలెక్టర్ ఉదహరించారు.  ఎటువంటి సందేహం లేకుండా క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుని వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. పురుషుల్లో కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. మహిళల్లో ఛాతీ, గర్భాశయ క్యాన్సర్ గుర్తించే ఆధునిక టెస్ట్ లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వ్యాధి బారిన పడిన తదుపరి చికిత్స కంటే వ్యాధి లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు ముఖ్యం అన్నారు. ముఖ్యంగా యువత సమాజంలో అవగాహన కలిగచేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో డెల్టా ఆసుపత్రి చైర్మన్  డాక్టర్ ఆర్ భాస్కర్ చౌదరి,  ఎం డి. డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఈ డి  డాక్టర్ నితిన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్ర, న్యూరోసర్జన్ డాక్టర్ గీతా శ్రవణ్ న్యూరో పిజిషియన్ డాక్టర్ రాజ్యలక్ష్మి ,   రేడియాలజిస్ట్ డాక్టర్ హరి కిషన్, పల్మోనాలజిస్ట్ డాక్టర్ రవి కుమార్, పలు కళాశాల విద్యార్థిని లు, డెల్టా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments