మనం ఇప్పటి వరకు రాజకీయంగా పోరాడాం...కానీ ఇప్పుడు రాష్ట్రంలో వింత జంతువులతో పోరాడుతాం.ఏలూరులో టీడీపీ జోన్-2 పరిధి లోని పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.


ఏలూరు (ప్రజా అమరావతి);


రాష్ట్రంలో మళ్లీ చరిత్ర మార్చేందుకు ఈ రోజు ఏలూరి సమావేశం నాంది కాబోతుంది

కార్యకర్తలకు అనుకుంటే పార్టీకి తిరిగి అధికారం ఖాయం. మనం కాదు అనుకుంటే తప్ప మనల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు...రాదు.

మనం ఇప్పటి వరకు రాజకీయంగా పోరాడాం...కానీ ఇప్పుడు రాష్ట్రంలో వింత జంతువులతో పోరాడుతాం.


మనుషులకు అయితే మనసు, సిగ్గు ఉంటుంది....కానీ ఈ వైసీపీ సైకోలకు ఏమీ ఉండదు

వివేకా హత్యకేసులు పరిణామాలు చూస్తున్నాం...హూ కిల్డ్ బాబాయ్ అని అడిగితే...అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని గూగుల్ టేకవుట్ లో తెలిసిపోతుంది.

గూగుల్ టేకవుట్ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు

టెక్నాలజీ పవర్ ఫుల్ గా ఉంది. కానీ మొద్దు జగన్ కు ఇదేమీ అర్థం కాలేదు.

వివేకా చనిపోతే గుండెపోటుతో చనిపోయాడు అని ముందుగా సొంత పత్రికలో రాశారు. 

కుమార్తె సునీత పోస్ట్ మార్టం కోసం పట్టుబడితే బండారం బయటపడింది.

అంత భయంకరంగా మనిషిని చంపేసి....నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశారు

సిబిఐ విచారణ కావాలి అన్నాడు...రాష్ట్రం అంతా తిరిగి నాడు ఎన్నికల్లో సానుభూతి తెచ్చుకున్నాడు

మన ప్రజలు మంచివాళ్లు...దొంగల పైకూడా సానుభూతి చూపిస్తారు.

• వీళ్ళు చంపి బిటెక్ రవి పేరును, ఆదినారాయణ రెడ్డిపేరును నిందితుల జాబితాలో చేర్చారు.

వివేకా కుమార్తె పోరాటం వల్ల వాస్తవాలు బయట పడ్డాయి.

ఇప్పుడు సజ్జల వచ్చి మళ్లీ నేను సిబిఐను మానేజ్ చేస్తున్నా అంటున్నాడు

సొంత మీడియాను పెట్టుకున్న జగన్ తనకు మీడియా లేదు అంటాడు

టీవీ9, ఎన్టీవీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి....వీళ్లు ఒక్క వార్త రాయరు

• వివేకా కేసులో గూగుల్ టేకవుట్ ద్వారా అన్ని వాస్తవాలు బయట పడ్డాయి.

నిందితులుకు ఇస్తాము అన్న 40 కోట్లు ఎక్కడివి

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వచ్చేది టీడీపీనే

నా బలం మీరే...నా సైన్యం మీరే...

బాదుడే బాదుడు అని మనం పెడితే వాళ్లు గడప గడపకు మన పార్టీ అన్నారు...ఫ్లాప్ అయ్యింది. దీంతో గడప గడపకు మన ప్రభుత్వం అన్నాడు. పోలీసులను అడ్డుపెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం అని నిర్వహించారు.

ప్రజలు తిరగబడకుండా పోలీసులను పెట్టి గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు.

మన మహానాడు జరుగుతుంటే వైసిపి వాళ్లు బస్సు యాత్ర పెట్టారు...అది తుస్సు మంది

ప్రభుత్వ పన్నుల బాదుడుపై బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం.....అనంతరం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పెట్టాం...అది సూపర్ హిట్ అయ్యింది.

అనపర్తి సభకు వెళితే అనేక అడ్డంకులు సృష్టించారు. ఆంక్షలు పెట్టారు.

సభకు అనుమతి ఇచ్చి తరువాత అనుమతి లేదు అన్నారు. దీంతో పట్టుబడ్డి కార్యకర్తల మద్దతుతో సభ నిర్వహించాను.

మహాత్మా గాంధీ దండి మార్చి వంటి పోరాటాలు చేయకపోతే స్వాతంత్ర్యం వచ్చేదా...

మనం కూడా అదే స్పూర్తితో పోరాటం చెయ్యాలి.

తమను ఎవరూ ప్రశ్నించకూడదు అని ఈ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో మాస్క్ ఇవ్వాలి అని అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపేశారు

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకోల్లుగా జరిగాయి.

మనం కందుకూరు సభ పెట్టుకుంటే అక్కడ పోలీసులు కనీసం సహకరించలేదు...దీంతో ప్రమాదం జరిగింది

కుప్పం వెళితే అక్కడా ఇబ్బందులు పెట్టారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసి వైసిపి వాళ్లు గెలిచారు. అందుకే ఓటర్ వెరిఫికేషన్ అనే కార్యక్రమం తీసుకువచ్చాం

వాలంటీర్లకు నేను వ్యతిరేకం కాదు...కానీ ప్రజల పన్నుల ను జీతాలుగా తీసుకుంటున్న వారు వైసిపి కోసం పనిచెయ్యకూడదు

గృహసారధుల వ్యవస్థను ఎదుర్కొనేందుకు మనం కొత్త వ్యవస్థను తీసుకువచ్చాం.

అందుకే మనం కుటుంబ సాధికార సారధిలను పెట్టాం. మగ వారితో పాటు  ఆడవారు కూడా కుటుంబ సాధికార సారధిలుగా ఉంటారు.

మహిళలకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలి. నాయకులు కూడా ఇది గమనించాలి

మహిళలు రాజకీయాల్లో కరివేపాకులు కాదు...వారికి అవకాశాలు ఇస్తాం.

ఎన్నికల్లో గెలిచాక వచ్చి...చుట్టూ తిరిగి...తరువాత వెళ్లిపోయే వాళ్లు నాకు వద్దు

వైఎస్ఆర్ పార్టీపేరు కూడా కరెక్టు కాదు...పూర్తిపేరు చెప్పకుండా వేరు వాళ్లు పెట్టిన పార్టీని తీసుకుని రాజకీయం చేస్తున్నారు

వైసిపి వాళ్లు ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తున్నారు.

వాలంటీర్లు, గృహసారధుల ద్వారా ఓట్లు తీసేస్తున్నారు.

ప్రజలంతా ఓట్లు చూసుకోవాలి....ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అంటే ఓటు చాలా కీలకం

కుటుంబ సాధికార సారధి ఓట్ల విషయంలో ఎప్పటికప్పుడు సీరియస్ గా ఉండాలి

ఒక్క దొంగ ఓటు పడనివ్వకూడదు...మన ఓటు తొలగించకూడదు

కేంద్రం ఎన్నికల సంఘం వరకు అయినా వెళ్లి ఓట్ల కోసం పోరాటం చెయ్యాలి

కార్యకర్తలు ఎవరెవరు పనిచేస్తున్నారో....వాళ్ల పనితీరు ఏంటో పూర్తిగా లెక్కలు రాస్తున్నా

ఆ లెక్కల ఆధారంగానే రేపు అందరికీ పదవులు ఇస్తాను

వైసిపి నేతలు చాలా జమ్మిక్స్ చేస్తారు. మన ఇంట్లో గంజాయి పెట్టి మన మీద కేసు పెడుతున్నారు.

నేను తప్పు చేయను నిప్పులా ఉంటాను. ఈ కేసులకు భయపడను.

వైసిపి నేతల అరాచకాలపై ట్రిబ్యునల్ వేస్తాను...విచారణ చేస్తాను

వైసిపి నేతల హనీమూన్ ముగిసింది అని తెలుసుకోవాలి

ఆటో డ్రైవర్ కు 10 వేలు ఇచ్చి...లక్ష రూపాయలు లాగుతున్నారు. ఇలాంటి విషయాలు అన్నీ ప్రజలకు వివరించాలి

ఈ బాధ్యత పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. ప్రజలు ఎలా నష్టపోయారు అనేది మనం చెప్పగలిగితే...ఒక్క చాన్స్ అని వచ్చిన జగన్ కు అదే చివరి చాన్స్ అవుతుంది

మళ్లీ గెలిస్తేనే అసెంబ్లీకి వస్తాను అని సవాల్ చేశాను. ఈ విషయాన్ని నాతో పాటు కార్యకర్తలు కూడా గుర్తు పెట్టుకోవాలి

ముందుస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ముందస్తు రాకపోతే 2024 ఏప్రిల్ వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది. ముందస్తు ఎన్నికలు పెడితే ప్రభుత్వం ముందే పోతుంది.

మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్దం కావలి. అందుకే ఈ శిక్షణా కార్యక్రమాలు

పనిచేయని నేతలు మార్చాలా వద్దా....మీరే చెప్పండి.

ఈ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది. నేను సర్వే చేయిస్తే అన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చాయి.

కొందరు ఇప్పుడు బహిరంగంగా చెపుతున్నారు...కొందరుమరో నాలుగు రోజులు ఆగి బయటకు చెపుతాం అంటున్నారు. పథకాలు పోతాయని కొందరు భయపడుతున్నారు.

నాడు పోలవరం ముంపు మండలాలను మనకు ఇచ్చిన తరువాతనే నేను సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాను

అనేక సార్లు స్వయంగా పోలవరం వచ్చాను.....72 శాతం పూర్తి చేశాను. 

టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ కు పోలవరం పూర్తి అయ్యేది.

రివర్స మాన్ వచ్చాడు...పోలవరం ను రివర్స్ చేశాడు

నాటి పథకాలు అన్నీ ఆపేశారు....సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం

రేపు అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ది, సంక్షేమం చేస్తాం.

ట్యాంక్ లో నీరు ఉంటేనే ట్యాప్ లో నీరు వస్తుంది. అభివృద్ది జరిగి ఆదాయం వస్తేనే సంక్షేమం చెయ్యవచ్చు. కానీ ఈ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది.

ప్రస్తుతం తలసరి జిఎస్టీ లో మనం ఒడిశా కంటే వెనకబడి ఉన్నాం. అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి

బతకడానికి పెట్టే ఖర్చు కంటే మద్యం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి

రాష్ట్రంలో బియ్యం మాఫియానడిపేది వైసిపి ఎమ్మెల్యే. తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం నుంచి అక్రమాలకు తెరతీశారు.

వైసిపి నేతలు దళితుడిని హత్య చేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు. పైగా అలాంటి వారికి సన్మానాలు చేస్తున్నారు

రాష్ట్రంలో మద్యం, నిత్యావసరాల విషయంలో వాస్తవాలు ప్రజలకు వివరించాల్సి ఉంది. పేదల ఆరోగ్యం పట్టని ముఖ్యమంత్రి ఈ సిఎం.

తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు అండగా నిలిచిన బిసి వర్గాలకు పార్టీ అండగా ఉండాలి

తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలకు మళ్ళీ న్యాయం చేస్తాం

బిసిలకు ప్రత్యేకం గా  మానిఫెస్టో లో అంశాలు పెట్టి న్యాయం చేస్తాం

ఎస్సిలకు ఇచ్చే 27 పథకాలు రద్దు చేశారు. నాడు ఎస్ సి కాలనీల్లో ఎంత అభివృద్ది జరిగిందో ప్రజలకు తెలియాలి

ఇసుక, మైనింగ్ మాఫియాపై ప్రజలకు వాస్తవాలు వివరించాలి.

జగన్ తీరు వల్ల ప్రతి వ్యక్తి పై రెండు లక్షల రూపాలు నెత్తిన అప్పు పెట్టాడు

జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రైతాంగం మన రైతులు

మూడేళ్లలో జగన్ కట్టింది 5 ఇళ్లు. మనం కట్టిన టిడ్కొ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో జగన్ ప్రభుత్వం చెప్పాలి.

Comments