చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*


*ఇప్పటికే వరసగా నాలుగో ఏడాది, ఈ ఏడాదికి మూడో విడతగా*


*రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్ళు రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించడంతో పాటు నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున సాయం అందించిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1090.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని (28.02.2023) గుంటూరు జిల్లా తెనాలిలో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం మాత్రమే రూ. 27,062.09 కోట్లు



చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం


మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 – 4 సంవత్సరాలు – రూ. 50,000

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్నది ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలు – రూ. 67,500

రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500


రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500

మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు – మే నెలలో రూ. 7,500

రెండవ విడత – అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000

మూడవ విడత – పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000


గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన సాయం రూ. 1,45,751 కోట్లు.


రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం, పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, 5 రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరల ప్రకటన, రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. ఏడాది పొడవునా వర్షాలు, సమృద్దిగా పంటలు, ఒక్క కరవు మండలం ప్రకటించే పరిస్ధితి కూడా రాలేదు.


గత ప్రభుత్వంలో అరకొరగా విత్తనాలు, ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు ఎప్పుడు వస్తాయో, ఎంతమందికి వస్తాయో, ఎంత వస్తాయో తెలియని పరిస్ధితి. ఆశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, అయిన వారికే పరిహారం, ఏడాది పొడవునా కరవు, ఐదేళ్ళలో 1,623 కరవు మండలాల ప్రకటన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన లేదు.


*రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ*


*2022 డిసెంబర్‌లో మాండోస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 76.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రబీ 2022 ముగియక ముందే నేడు (28.02.2023) బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*నేడు జమ చేస్తున్న రూ. 76.99 కోట్లతో కలిపి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 22.22 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ. 1,911.78 కోట్లు*.


రైతన్నకు అండగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం...ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి పరిహారం అందాలి, అదీ సకాలంలో అందాలి


ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ...రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ


గత ప్రభుత్వంలో...నాడు


అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, అయినవారికే పరిహారం. రైతన్నలు క్షేత్రస్ధాయి ఉద్యోగుల చుట్టూ తిరిగి ఏళ్ళ తరబడి ఎదురుచూసినా నష్టపరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాలలో రెండు, మూడు సీజన్ల తరువాతనే సాయం అందేది. అరకొరగా అందే ఆ పరిహారానికి కూడా మధ్యవర్తులు, దళారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి.


మనందరి ప్రభుత్వంలో...నేడు


శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్‌ ఆధారంగా పంట నష్టాల అంచనా. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించి మరీ, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం


నాడు...


అరకొరగా, ఆలస్యంగా, అదీ కొందరికే సాయం

2014 ఖరీఫ్‌లో సంభవించిన కరువుకు నవంబర్‌ 2015లో, 2015 కరువుకు నవంబర్‌ 2016లో సాయం అందించారు

2015 నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ. 260.43 కోట్ల పంట నష్టానికి అందించిన సాయం సున్నా.

2016 కరువుకు జూన్‌ 2017లో, 2017 కరువుకు ఆగష్టు 2018లో, 2018 పెతాయి సైక్లోన్‌ నష్టాలకు ఫిబ్రవరి 2019లో సాయం అందించారు

2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ. 1,832.28 కోట్లు, రబీలో రూ. 356.45 కోట్ల పంట నష్టానికి అందించిన సాయం సున్నా


మరి నేడు...ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం


2020 మార్చివరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 1.57 లక్షల మంది రైతులకు రూ. 123.70 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 ఏప్రిల్‌ లో అందజేత


2020 ఏప్రిల్‌ నుండి 2020 అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ. 278.87 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 అక్టోబర్, నవంబర్‌లో అందజేత


2020 నవంబర్‌ చివరిలో నివార్‌ సైక్లోన్‌ వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ. 645.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 2020 డిసెంబర్‌లో అందజేత


2021 సెప్టెంబర్‌ నెల చివరిలో గులాబ్‌ సైక్లోన్‌ వల్ల నష్టపోయిన 35 వేల  మంది రైతులకు రూ. 22.10 కోట్ల సాయం 2021 నవంబర్‌లో అందజేత


2021 నవంబర్‌లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన 5.97 లక్షల మంది రైతులకు రూ. 542.10 కోట్ల సాయం 2022 ఫిబ్రవరిలో అందజేత


2019 గత ప్రభుత్వంలో తిత్లీ తుఫాన్‌ వల్ల నష్టపోయిన ఉద్యానవన పంటలకు అదనపు పరిహారం 91 వేల మంది రైతన్నలకు 182.63 కోట్లు 2022 జూన్‌లో అందజేత


జులై – అక్టోబర్‌ 2022లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన 46 వేల మంది రైతన్నలకు రూ. 39.40 కోట్లు నవంబర్‌ 2022లో అందజేత


డిసెంబర్‌ 2022 మాండోస్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన 91 వేల మంది రైతన్నలకు రూ. 76.99 కోట్లు నేడు (28.02.2023) అందజేత  


నాడు


కౌలు రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. వాస్తవ సాగుదారులు కాని భూయజమానులకు మాత్రమే లబ్ధి


నేడు


ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా పంట నష్టాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నందున కౌలు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ లబ్ధి


నాడు


రైతన్నలకు లబ్ధిదారుల జాబితా చూసుకునే వెసులుబాటు లేని దుస్ధితి, పారదర్శకతకు పాతర


నేడు


లబ్ధిదారుల జాబితాలు సోషల్‌ ఆడిట్‌ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నందున గ్రామ స్ధాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని, పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు.

Comments