శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):

    ఈ రోజు అనగా ది.14-02-2023  న  శ్రీయుత ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు  మరియు పాలకమండలి సభ్యులు ఆలయము నందు ప్రతిరోజూ జరుగు అన్నదానం ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగముగా మహామండపం 03 వ అంతస్తు నందు ఉన్న అన్నదానం క్యూ లైన్ లు, తదనంతరం మహామండపం 02 వ అంతస్తు నందు జరుగు అన్నదాన కార్యక్రమం ను పరిశీలించారు. అన్నప్రసాదం స్వీకరిస్తున్న పలువురు భక్తులను చైర్మన్ గారు అన్నదానం మరియు ఏర్పాట్లపై అభిప్రాయాలు అడుగగా భక్తులు అందరూ సంతృప్తిని వ్యక్తపరిచారు. అనంతరం పాలకమండలి చైర్మన్ గారు మరియు సభ్యులు అన్నప్రసాదం ను స్వీకరించారు. ప్రతిరోజూ జరుగుచున్న అన్నదాన కార్యక్రమం గురించి అన్నదాన విభాగం అధికారులు పాలకమండలి చైర్మన్ గారికి వివరించారు. అనంతరం అన్నదానం నందు ఏర్పాట్లు బాగున్నాయని చైర్మన్  తెలిపారు. శానిటేషన్ అధికారులకు చైర్మన్  కొన్ని సూచనలు చేశారు. వృద్దులు మరియు దివ్యాంగులు కొరకు మెరుగైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు శ్రీ కట్టా సత్తయ్య , బచ్చు మాధవీ కృష్ణ , సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ పి. చంద్రశేఖర్ , పర్యవేక్షకులు లక్ష్మి ప్రసన్న 


మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments