తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును మార్చలేదు

 *“తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” పేరును మార్చలేదు*

*విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్*

                                                                  

అమరావతి, ఫిబ్రవరి 14 (ప్రజా అమరావతి): విజయవాడ నగర పరిధిలోని సుప్రసిద్ద *“తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం”* పేరును ఏమాత్రం మార్చలేదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టంచేశారు. నేడు పలు దినపత్రికల్లో ఆ కళాక్షేత్రం పేరును మార్చినట్లుగా వచ్చిన వార్తాంశాల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. 2016 లో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్బంగా ఈ కళాక్షేత్రం ఎలివేషన్ ను పునరుద్దరించే సమయంలో “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” అనే పేరును తొలగించి మళ్లీ ఆ పేరును పునరుద్దరించబడలేదన్నారు. అయితే ఈ కళాక్షేత్రం కేవలం సాంస్కృతిక  కార్యక్రమాల నిర్వహణ కోసం మాత్రమే నిర్థేశించబడినది అనే ఉద్దేశ్యాన్ని ప్రస్పుటంగా తెలియజేయాలనే లక్ష్యంతో డిశంబరు 2021 లో   *“కళాక్షేత్రం”* అనే పేరుతో ఎలివేషన్ భాగంపై గ్లో సైన్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  “తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం” అనే పేరుతో  బోర్డును తయారు చేయడం జరుగుచున్నదని, అది పూర్తయిన వెంటనే భవనమునకు  ఆ బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. 

                                                                                                                                                                            

Comments