శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

     ఈరోజు అనగా ది.14-02-2023 న గౌరవనీయులైన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు DoNER(డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్) మంత్రివర్యులుశ్రీ G.కిషన్ రెడ్డి  శ్రీఅమ్మవారి ఆలయము నకు విచ్చేయగా  ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు , కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి గార్లు కేంద్ర మంత్రి వర్యులకు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. కేంద్రమంత్రివర్యులతో పాటుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు , నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి  మరియు ఇతరులు ఉన్నారు.

Comments