రానున్న రోజులలో మరింత అభివృద్ధి దిశగా మంగళగిరి - స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్కే...

 రానున్న రోజులలో మరింత అభివృద్ధి దిశగా మంగళగిరి - స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్కే...



సుమారు 344 కోట్ల రూపాయల భారి బడ్జెట్ సిద్దం చేసిన నగరపాలక సంస్థ.


కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా అమృత్ - 2 పథకంలో భాగంగా మంగళగిరి నగరానికి 50 కోట్ల రూపాయల కేటాయింపు..


నగర ప్రజలు జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని మనవి..

మంగళగిరి (ప్రజా అమరావతి);

ఈ రోజు మంగళగిరి నగరంలోని MTMC కార్యాలయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తో కలిసి నగరపాలక సంస్థ అధికారులతో బడ్జెట్ అంశంపై ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యేక సమావేశం నిర్వహించారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ 190 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో.. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఏర్పడిన తరువాత మొదటి సారిగా సుమారు 344 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను అధికారులు సిద్ధం చేశారని అన్నారు..

 

ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు MTMC కి 130 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. 


నగర ప్రజలకు కార్పొరేషన్ ద్వారా మరిన్ని సేవల అందించడంతోపాటు ఆదాయ వనరులు మెరుగుపడేలా అధికారులు కృషి చేయాలని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పథకంలో భాగంగా మంగళగిరి నగరానికి కేవలం మంచినీటి కొరకు సుమారు 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం శుభ పరిణామం అని అన్నారు..


పూర్తి స్థాయిలో మంగళగిరి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


నగర ప్రజలందరూ జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని ఆయన మనవి చేశారు


ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments