విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

 విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలిజిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్


పుట్టపర్తి ,ఫిబ్రవరి, 13 (ప్రజా అమరావతి): విద్యార్థులు శాస్త్ర, సాంకేతికతను  పెంపొందించుకొని గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని   జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామ సమీపంలో ఉన్న మంగళకర పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన సదస్సు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా  శ్రీ సత్య సాయి  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పి బసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ మానవుని యొక్క మనుగడ అభివృద్ధి రాబోవు తరాలకు అనుగుణంగా ప్రకృతిని కాపాడడం కోసమే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రూపొందించిన ప్రాజెక్టులు సమాజానికి ఉపయోగపడలా ఉండాలన్నారు. సాంకేతికతను అభివృద్ధి  చేసుకునే క్రమంలో  పాఠశాల స్థాయి మండల , స్థాయి పోటీలను నిర్వహించి వివిధ అంశాల ఆధారంగా ప్రతి మండలం నుండి 5 మందిని ఎంపిక చేసి ఈరోజు జిల్లా స్థాయి పోటీలను మంగళకర పాఠశాలలో నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఈ పోటీలలో జిల్లాలోని 32 మండలాల నుంచి 160 మంది విద్యార్థులు  పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 139 ప్రాజెక్టులో ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైజ్ఞానిక ప్రదర్శన ల కార్యక్రమాలు  నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆలోచనలకు పునాదిగా  ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్  తెలిపారు. విద్యార్థులు ఆయా పాఠశాల ల కు చెందిన గైడ్ టీచర్ల సూచనలతో ప్రస్తుత వైజ్ఞానిక ప్రదర్శనలో పుస్తక రూపంలో ఉన్న ప్రాజెక్టు లే కాకుండా స్వతహాగా సొంత ఆలోచన విధానంతో  తయారు చేసే విధంగా ఆసక్తి కలిగి ఉండాలన్నారు.


 మన దేశ శాస్త్రవేత్తలు   శాస్త్ర, సాంకేతిక రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ  ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ముందు వరసలో నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య , ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాల తీర్చు దిద్దుతున్నట్లు తెలిపారు. గ్రామం నుంచి  ప్రపంచ స్థాయి విద్యను అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులను  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు  ప్రేరేపించి ఆటపాటల్లో కూడా వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాల  పంపిణీ మొదలుకొని  ట్యాబులు , ఇంగ్లీషు బోధనా విధానం  అమలు లాంటి అంశాలు  జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్న తరుణంలో  ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను  నిర్మూలించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నదని వాటికి అనుగుణంగా విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన  వివిధ ప్రాజెక్టు ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయని,  సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పండించిన ధాన్యాలు , తృణధాన్యాల వాడకం, ఆరోగ్యం, గ్లోబల్ వార్మింగ్ తదితర వాటిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలను పారద్రోలి శాస్త్ర సాంకేతికతను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇలాంటి ప్రదర్శన ద్వారా విద్యార్థులలో విజ్ఞానం, మేధస్సు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నూతన జిల్లాలో తొలిసారి  ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయడం  హర్షనీయమైనదని   నేడు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పదిమంది విద్యార్థులను  ఎంపిక  కాబడినట్లు తెలిపారు.వాతావరణం -పర్యావరణ హిత పదార్థాలు అనే అంశంపై  చిలుమత్తూర్ జడ్పీహెచ్ఎస్ ఏడవ తరగతి విద్యార్థి సంపత్ కుమార్ మొదటి విన్నర్ గా ఎంపిక కాగా, అగలి ఏపీ ఎంఎస్ 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ ద్వితీయ విన్నర్ గా ఎంపికయ్యారు. అలాగే ఆరోగ్యం - పరిశుభ్రత అంశంపై ధర్మవరం మున్సిపల్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థి ఉమేరా  మొదటి విన్నర్ గా ఎంపిక కాగా రెండవ విన్నర్ గా సికేపల్లి మండలం నాగసముద్రం జడ్పీహెచ్ఎస్ పాఠశాల పదవ తరగతి విద్యార్థి లక్ష్మీ నరసింహ విజేతగా నిలిచారు. సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ అంశంపై ధర్మవరం బిఎస్సార్ మున్సిపల్ హైస్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థి నారాయణ మొదటి విన్నర్ గా, పరిగి మండలం దానాపురం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి మంజుల రెండవ విన్నర్ గా ఎంపికయ్యారు. గణితం అంశంలో తనకల్లు గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్  తొమ్మిదవ తరగతి విద్యార్థిని తులసి మొదటి విన్నర్ గా ఎంపిక కాగా చిలుమత్తూరు జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి ధనుంజయ రెండవ విన్నర్ గా ఎంపికయ్యారు. చివరిగా పర్యావరణం - వాతావరణ మార్పు అంశంపై రామగిరి జడ్పీహెచ్ఎస్ ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటేష్ మొదటి విన్నర్ గా ఎంపిక కాగా ద్వితీయ విన్నర్ గా కొత్తచెరువు జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థి జాహ్నవి విజేతలుగా నిలిచిన సందర్భంగా  విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ ప్రశంస ప త్రాలను ప్రధానం చేశారు. 


ఈ కార్యక్రమంలో  పెనుగొండ ఉప  విద్యాశాఖ అధికారి రంగస్వామి, జ్యూరీ మెంబర్ లు జి ఎల్ ఎన్ ప్రసాద్ ,సూర్య నాగిరెడ్డి ,డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ ,మంగళకర చైర్మన్ సురేష్,  సైన్స్ ఆఫీసర్ ఆనంద్ భాస్కర్ రెడ్డి, ఎంఈఓలు  వెంకటరమణ నాయక్ ,గోపాల్ నాయక్ , విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.Comments