ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ (ప్రజా అమరావతి);
గౌరవ ముఖమంత్రి గారి పై అనుచిత వాఖ్యలు చేసిన ఏ ఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు మరియు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించిన ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. గారు.
ది.01.02.2023 వ తేదిన రాత్రి సుమారు 01.30 hrs, చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిదిలోని గౌరవరం గ్రామం, హెచ్.పి పెట్రోల్ Bunk సమీపంలో హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్మేడ్ రిజర్వు కానిస్టేబుల్ 2587 తన్నేరు వెంకటేశ్వర్లు, గౌరవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో మాటల సందర్భంలో కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రివర్యులు మరియు వారి కుటుంబ సభ్యుల పైన అనుచిత వాఖ్యలు చేస్తూ అసభ్యకర పదజాలంతో మాట్లాడినాడు. అంతేగాక కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడినాడు. సదరు వ్యక్తి ఆ దుర్భాషలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించినారు.
ఒక భాద్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి రెండు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం చట్టప్రకారం నేరం. దీనిపై వీడియో తీసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై చిలకల్లు పోలీస్ వారు కేసు నమోదు చేసినారు.
నగర పోలీస్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు చిల్లకల్లు పోలీస్ వారు కానిస్టేబుల్ ను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినారు. అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం, జగ్గయ్యపేట ముద్దాయి కి 14 రోజులు పాటు రిమాండ్ విధించడం జరిగింది.
నగర పోలీస్ కమీషనర్ గారు క్రమశిక్షణా చర్యలలో భాగంగా సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఒక బాధ్యత గల ఉద్యోగంలో వుండి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నగర పోలీస్ కమీషనర్ తెలియజేశారు.
addComments
Post a Comment