దేశంలోనే అత్యంత వేగంగాఅభివృద్ది చెందుతున్న రాష్ట్రఆర్థిక వ్యవస్థ

 *దేశంలోనే అత్యంత వేగంగాఅభివృద్ది చెందుతున్న రాష్ట్రఆర్థిక వ్యవస్థ


*

*•దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్*

*•దేశ వ్యాప్త పెట్టుబడులు రూ.1,71,285 కోట్లలో రూ.40,361 కోట్లను ఆకర్షించి అగ్రగామిగా నిలచిన రాష్ట్రం*

*•భవిష్యత్ తరాల జీవితాల మార్పుకి పెట్టుబడే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు*

*•నవరత్న పథకాలు అమల్లో భాగంగా  పేదలకు అందించిన సంక్షేమం రూ. 1.92 లక్షల కోట్లపైనే*

*•సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం*

*•జగనన్న నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమంలో మంచి పురోగతిని సాదిస్తున్న రాష్ట్రం*

*రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం & సినిమాటోగ్రపీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ*

                                                                         

అమరావతి, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా మంచి పురోగతిని సాదిస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. అభివృద్ది, సంక్షేమం  రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్టమైన పలు ప్రణాళికల వల్లే ఇది సాద్యమైందని ఆయన పేర్కొన్నారు.  సోమవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో  మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత మూడున్నర్రేళ్లలో జగనన్న ప్రభుత్వం  రాష్ట్రంలో సాధించిన అభివృద్ది, సంక్షేమ ప్రగతిని వివరించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా మంచి పురోభివృద్ది సాదిస్తూ దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ముందుకు దూసుకువెళుతున్నది ఆయన తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు. 

                                                                                                                                                                                            అదే విధంగా సంక్షేమ పథకాల అమల్లో  దేశానికే ఆదర్శంగా  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నిలిచిందని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాల జీవితాల మార్పుకి  పెట్టుబడే లక్ష్యంగా  పలు వినూతన్న  సంక్షేమ పథకాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు. నవరత్నాలు పథకాలు అమల్లో భాగంగా  రాష్ట్రంలోని పేదలందరికీ  ఇప్పటి వరకూ దాదాపు రూ.1.92 లక్షల  కోట్ల పైనే సంక్షేమానన్ని అందించడం జరిగిందని ఆయన తెలిపారు. 

 

*దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ……*

                                                                                                                                                                               రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర్రేళ్లలో వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న పలు కార్యక్రమలు, విధానాల వల్ల దేశంలోనే అత్యంత వేగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్నదని ఆయన తెలిపారు.  2021-22 వ ఆర్థిక సంవత్సరంలో   రాష్ట్ర జి.ఎస్.డి.పి.  11.43 శాతంగా నమోదై దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది  చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందడం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో జి.డి.పి. 8.7 శాతం నమోదు అవ్వగా, రాష్ట్ర జి.ఎస్.డి.పి. కేంద్ర జి.డి.పి. కంటే  2.73 శాతం అదనంగా నమోదు అయినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 సమయంలో భారత దేశ వృద్ది రేటు -6.60 శాతం నమోదైన సందర్బంలో  కూడా రాష్ట్రంలో 0.08 శాతం వృద్ది రేటు నమోదు అయినట్లు ఆయన తెలిపారు.  రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువగా సాదించడమే కాకుండా దేశంలోనే  రాష్ట్రం ఆరవ స్థానంలో నిలిచిందన్నారు. అయితే  గత ప్రభుత్వ పాలనలో 2018-19  ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జి.ఎస్.డి.పి.  కేవలం 5.36 శాతంగా మాత్రమే నమోదు అయిన విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. 


*దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్…….*

                                                                                                                                                                                దేశంలోనే అత్యధిక స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, సులభతరంగా అనుమతులు మంజూరీకీ అమలు చేస్తున్న సింగిల్ విండోవ ధానం మరియు ఎం.ఎస్.ఎం.ఇ.లకు, పరిశ్రమల స్థాపనకు అందజేస్తున్న పలు రకాల ప్రోత్సహాకాల  కారణంగా గత   నాలుగేళ్ల   నుండి   ఈజ్ ఆఫ్  డూయింగ్ బిజినెస్ లో  (వ్యాపారం చేయడం సులభం) ఆంధ్రప్రదేశ్  అగ్రగామిగా నిలిచిందన్నారు.  


డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ  (DPIIT) నివేదిక ప్రకారం 2022 జూలై చివరి నాటికి దేశ  వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో మన  రాష్ట్రం  ఇతర రాష్ట్రాలతో పోటీపడి రూ.40,361 కోట్ల  మేర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి  దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పెట్టుబడిలను రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలోను, పరిశ్రమల స్థాపనలో 3 వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.  అయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్  ఈ రెండు అంశాల్లోనూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 

                                                                                                                                                                                       రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన  (SIPB) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు  సమావేశం 2022 డిసెంబర్‌లో జరిగిందని, ఆ సమావేశంలో   ₹ 23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం జరిగిందని.  ఇందులో  ₹ 8,800 కోట్లతో JSW స్టీల్ ప్లాంట్‌ను కడపలో,  ₹ 6,330 కోట్లుతో అదానీ గ్రీన్ ఎనర్జీ  మరియు ₹8,855 కోట్లతో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపడం జరిగిందన్నారు.  అదే విధంగా టైర్ల రంగంలో ప్రపంచంలోననే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైనా ATC అలయన్స్ టైర్స్ రూ.1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ ఏర్పాటుకు జూన్ 2022 లో పెట్టుబడి పెట్టిందన్నారు. 

                                                                                                                                                                                  జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా గత 4 సంవత్సరాలుగా  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంలో భారతదేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించడం మనకు ఎంతో గర్వకారణమన్నారు.  జూన్ 2022లో  BRAP (వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక) తెలిపిన రేటింగ్స్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గుజరాత్, తెలంగాణ, తమిళనాడులను ఏపీ అధిగమించి అగ్రస్థానాన్ని పొందిందని మంత్రి తెలిపారు.

                                                                                                                                                                                                                BDP బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా అన్ని దక్షిణ భారత రాష్ట్రాలలో AP అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆగస్టు 2022లో తూర్పు గోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ను స్థాపించడానికి కేంద్రం నుండి ₹1,000 కోట్ల గ్రాంట్‌ను పొందడం జరిగిందని మంత్రి తెలిపారు. 


*ఎం.ఎస్.ఎం.ఇ. ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్న ఏకైక  రాష్ట్రం ఆంధ్రప్రదేశ్..……*

                                                                                                                                                                                    ఎం.ఎస్.ఎం.ఇ.లకు విస్తృత  స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో  వాటి ఉత్పత్తుల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యతన నిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ అని మంత్రి తెలిపారు. COVID-19 సమయంలో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి MSMEలకు రీస్టార్ట్ ప్యాకేజీని పొడిగించడం జరిగిందన్నారు.  YSR నవోదయం స్కీమ్ కింద MSME లకు ₹7,976 కోట్ల పై చిలుకు రుణాలను పునర్నిర్మించిన 1.78 లక్షల MSME ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు.  YSR కడపలోని కొప్పర్తిలో YSR జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్,  YSR ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)ని 3,155 ఎకరాల విస్తీర్ణంలో  అభివృద్ధి  పర్చి డిసెంబర్ 23, 2021న ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బల్క్ వాటర్ సప్లై, విద్యుత్ తదితర అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరుగుచున్నదన్నారు.  గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రి   శ్రీ వై.ఎస్.జగన్మోహన్  రెడ్డి నేతృత్త్వంలో దావోస్ వెళ్ళిన బృందం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో సహా దాదాపు రూ.1.25 లక్షల కోట్లు  ఎం.వో.యు.లు చేసుకోవడమే  కాకుండా అందులో దాదాపు రూ.30వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు  SIPB అనుమతులు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.  అయితే గత ప్రభుత్వ హయాంలో 2014-19 మద్య అప్పటి ముఖ్యమంత్రి  5సార్లు దావోస్ వెళ్ళి ప్రపంచ ఆర్దిక వేదిక పై పలు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ  ఆ ఒప్పందాల్లో కనీసం ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదన్నారు,  కానీ పర్యటనల నిమిత్తం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

                                                                                                                                                                                    అదే విధంగా వచ్చేనెల మార్చిలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్విస్టేమెంట్ సమ్మిట్ లో రాష్ర్టానికి అన్ని రంగాల్లో ఇంకా పెట్టుబడులు వచ్చే విధంగా   రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి   తెలిపారు. 


 

Comments