జగన్ సీఎం అవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం.

 తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, కీలపూడి (ప్రజా అమరావతి)

జగన్ ది అధికార మదం..మనది యువగళం.

జగన్ ది పోలీస్ బలం..మనది ప్రజాబలం.

నేను ఊరూరా స్టూల్ వేసుకుని మాట్లాడితే ఈ జగన్ లాక్కున్నాడు. 

నా గొంతులో సౌండ్ ఉన్నంత వరకు నిన్ను వదలను జగన్.

నా మైక్ లాక్కుంటే...నా తరపున 5 కోట్ల ప్రజలు నిన్ను నిలదీస్తారు.

జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుండి బయటకు వస్తే ప్రజలు రాళ్లు, టమోటాలు వేస్తారని పరదాలు కట్టుకుని వస్తున్నాడు. 

మనం దమ్మూ ధైర్యంతో ప్రజల మధ్య నడుస్తున్నాం.

భయం మా బయోడేటాలో లేదు. నా సౌండ్ వెహికల్, మైక్, స్టూల్ లాక్కున్నా తగ్గేదేలేదు.

రాష్ట్రలో నిన్న ఒక దారుణమైన ఘటన జరిగింది. తాడేపల్లి కొంపకు కిలోమీటరు దూరంలో రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో రాణి అనే దళిత యువతిని కత్తులతో పొడిచి చంపారు. 

జగన్ రెడ్డి రూ.10 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూశాడు.

అంటే ఆమె జీవితం విలువ పది లక్షలా? నేను రూ.20 లక్షలు ఇస్తా రాణి ప్రాణాన్ని తీసుకొస్తావా జగన్?

ఇంత జరుగుతున్నా మహిళల భద్రతపై సమీక్ష చేయడం లేదు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతోంది. 

సీఎం ఇంటి సమీపంలో హత్య జరగడం ఇది రెండో ఘటన.

జగన్ సీఎం అవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. 


బాధితులు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు. 

చంద్రబాబు మానవత్వం ఉన్న నాయకుడు... జగన్ ఒక 420.

ఈ 420 జగన్ సీఎం అయ్యాక మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువతును మోసం చేశాడు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 40 వేల పరిశ్రమలతో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

ఈ 420 జగన్ ఊరూరా తిరిగి 2.30 లక్షల ఖాళీ పోస్టుల భర్తీతోపాటు యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తా అన్నాడు. 

జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా.? అందుకే 420 అని పేరు పెట్టా. దొంగల్ని, మోసం చేసిన వాన్ని 420 అంటారు. 

ఎన్నికల ముందు రాష్ట్రానికి హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని అన్నాడు.

25 ఎంపీలిస్తే ఢిల్లీని గడగడలాడిస్తా అన్నాడు. కానీ మోడీని చూస్తే ఉచ్చ పోసుకుంటున్నాడు.

ఢిల్లీ ఎందుకు వెళ్తాడో తెలీదు..ప్రధానితో ఏం మాట్లాడతాడో తెలీదు. 

జగన్ చేతకాని తనంతో రాయలసీమకు అన్యాయం. అమర్ రాజాను తెలంగాణకు తరిమాడు 420 ఈ జగన్ రెడ్డి

ముఖేష్ అంబానీతో 90 నిమిషాలు మాట్లాడి 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే రిలయన్స్ పరిశ్రమను తెస్తే దాన్ని కూడా తెలంగాణకు పంపాడు ఈ 420.

గుడివాడ అమర్నాథ్ ను పరిశ్రమలు ఎప్పుడు వస్తాయని అడిగితే గుడ్డు ముందు వస్తుందా..కోడి ముందు వస్తుందా..పొదగడానికి సమయం పడుతుందని  మాట్లాడుతున్నారు.

ఈ మంత్రి, సీఎం చేతకాని తనం వల్ల రాష్ట్రంలోని పరివ్రమలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయి.

ఈ 420 సీఎం యువతనే కాదు..ఆడపడుచులను కూడా మోసం చేశాడు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా...లేదు?

సంపూర్ణ మద్యనిషేధం చేశాక ఓట్లు అడుగుతా అన్నాడు. మద్య నిషేధం చేశాడా.?

మద్యనిషేధం చేయకపోగా కల్తీ మద్యం పారిస్తున్నాడు. వాళ్లే తయారు చేసి, వాళ్లే బాటిల్ లో నింపేస్తున్నారు. 

షాపులు నడిపి, రాత్రి 6 తర్వాత బ్లాక్ లో అమ్మేది కూడా ఈ 420 జగన్ మనుషులే. 

ఓతాత వచ్చి జగన్ మద్యం తాగిన 3 నెలలకు డయాలసిస్ కు వచ్చానన్నాడు. 

ఈ మందును తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్టు చేయిస్తే దీనికి పొలంలోని పురుగు మందులు చనిపోతాయని తేలింది.

అమర్నాథ్  మీరు తెచ్చిన పరిశ్రమలు ఏంటో తెలుసా? బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రగోల్డ్ తెచ్చారు.

మహిళ మంగళసూత్రాలను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నాడు. 

దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే.

420 జగన్ రైతులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. చెరకు ఫ్యాక్టీరలు తెరుస్తా అన్నాడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు.

చంద్రబాబు ఉన్నప్పుడు 4 చెరకు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఇప్పుడు 1 మాత్రమే నడుస్తోంది.

టీడీపీ హయాంలో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేశాం. రాయలసీమకు డ్రిప్ అందించాం. 

కార్మికులకు 420 జగన్ తక్కువ ధరకు ఇసుక ఇస్తా అన్నాడు. కానీ 5 రెట్లు ధర పెరిగింది. ఇది కూడా స్థానిక ఎమ్మెల్యే కొట్టేస్తున్నాడు.

ఈ 420 జగన్ సీఎం అయ్యాక దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. అయినా మోటార్లకు మీటర్లు బిగించి ఉరితాడు వేయబోతున్నాడు.

ఎన్నికల ముందు మీకు గుర్తొచ్చిన రైతులు..ఇప్పడు గుర్తు రావడం లేదా జగన్.?

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు 1వ తేదీ జీతాలు రావదం లేదు. పెన్షన్ కూడా రావడం లేదు.

కేంద్రం అప్పర్ తుంగభద్ర డ్యాంకు రూ.5,300 కోట్లు కేటాయించింది. ఇది పూర్తయితే సీమకు చుక్కనీరు కూడా రాదు. దీనిపై ఎంపీలు, సీఎం జగన్ ప్రధానిని ఎందుకు అడగడంలేదు.?

రాయలసీమలో ఒక్కసాగునీటి ప్రాజెక్టైనా పూర్తి చేశారా.?

సీమబిడ్డ అని చెప్పుకుని కోట్లు ఖర్చు పెట్టి పాటలు రాయించుకున్నాడు.

కానీ సీమకు పట్టిన శని ఈ జగన్ రెడ్డి.

10 శాతం పెండింగులో ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 

అన్నీ పెంచుకుంటూ పోతా అంటే..పెన్షన్, చంద్రన్న బీమా, సంక్షేమం పెంచుతారు అనుకున్నాం

కానీ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు, గ్యాస్ ధర, పెట్రోల్ ధర, వంటనూనె ధర, చింతపండు ధరలు పెంచారు.

ఆటో డ్రైవర్ శివను కలిశా.. డీజిల్ పక్కరాష్ట్రాల కంటే మనరాష్ట్రంలో రూ.11 ఎక్కువగా ఉందన్నాడు.

ధరలు విపరీతంగా పెరిగాయి. వాలంటీర్ వాసు ఇంటికొచ్చి గాలి ఊదమని చెప్పి గాలికి కూడా పన్ను వేస్తారు.

అమ్మఒడి, పెన్షన్ కు జగన్ బొమ్మ ఉంటుంది. చెత్తపన్ను, క్వార్టర్ బాటిల్ పై  మాత్రం జగన్ బొమ్మ ఉండదు.

ఈ 420 జగన్ గిన్నీస్ రికార్డ్ లో ఉన్నాడు. ఎందులో అంటే...గంజాయి, అప్పులు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ దందాలో ఉన్నాడు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పరిశ్రమలు, సంక్షేమం, మహిళలను ఆదుకోవడంలో నెంబర్ -1 గా ఉన్నాం.

బాబాయిని ఎవరు చంపారు..ఈ 420 జగన్ చంపారు.

ఈయనే రూ.40 కోట్లు ఇచ్చి గడ్బపార కొనించి చంపించాడు. 

ఈ 420 వివేకాను చంపి చంద్రబాబు చంపించాడని అన్నారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో రాయించుకున్నాడు.

భారతీరెడ్డి పీఏ, అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలుస్తోంది. సొంత బాబాయిని చంపినోన్ని సైకో అంటారు. పేదలను వేధించే వాన్ని సైకో అంటారు. జిల్లాకొక సైకో ఉన్నాడు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా సైకో.

నెంబర్ ప్లేట్లు లేని లారీల్లో అక్రమ ఇసుక తరలిస్తున్నారు. దీనికి కారణం ఈ వీరప్పన్ పెద్దిరెడ్డి. ఎర్రచందనం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ పెద్దిరెడ్డి.

సత్యవేడులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు పెద్దిరెడ్డి, ఇంకొకరు ఆదిమూలుం. ఆదిమూలంను చూస్తే జాలేస్తోంది. ఇంకంతా పెద్దిరెడ్డి వద్ద..పెన్నుమాత్రమే ఆదిమూలం వద్ద ఉంది. 

చిత్తూరుజిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రబ్బర్ స్టాంప్. 

ఆదిమూలంను అడ్డుపెట్టుకొని పెద్దిరెడ్డి సత్యవేడు నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేస్తున్నారు.

సత్యవేడు ఎమ్మెల్యే ఎవరు? ఆదిమూలం ఈ నియోజకవర్గ ఎమ్మల్యే అని ఎవరికైనా తెలుసా? 

మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ నియోజకవర్గంలో భారీఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు.

నాగలాపురం మండలంలో ఇసుక తవ్వకాలను ఎన్ జీటీ నిషేధించింది. 

ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని గ్రీన్ ట్రిబ్యునల్ తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది.

అయినా గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాదిన్నరగా అరణియార్ నది వెంట అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. 

రోజుకు 100 టిప్పర్లు తవ్వేస్తూ పొరుగున ఉన్న తమిళనాడులో రూ.లక్ష చొప్పున అమ్ముకుంటూ ప్రతిరోజూ కోటిరూపాయలు దోచుకుంటున్నారు.

సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో గ్రావెల్, మట్టి మాఫియా రెచ్చిపోతోంది. 

కడప ఎంపీ  అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధానంగా ఈ దందాకు నాయకత్వం వహిస్తున్నారు.

తమిళనాడుకు రోజుకు 100 టిప్పర్లు తరలిస్తున్నారు. 

స్థానికులు పలుమార్లు ధర్నాలు చేస్తే తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. 

ఆదిమూలం కుమారుడు, నారాయణవనం జడ్పీటీసీ సుమన్ కూ ఇందులో వాటాలు ఉన్నాయి. 

నియోజకవర్గంలో వీధివీధినా బెల్ట్ దుకాణాలు బార్లా తెరిచేశారు. ఎమ్మెల్యే ఆదిమూలంకూ ఇందులో వాటా వెళుతోంది.

వైకాపా నాయకులు ఎక్కడికక్కడ డీకేటీ భూములను కొట్టేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలను దోచేశారు.

నాగలాపురం మండలం సురుటుపల్లి  రీచ్ లో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైకాపా వచ్చిన కొత్తలో దాదాపు ఏడాదిపాటు ఇసుకను తవ్వేశారు. అంతా చెన్నైకు తరలించేశారు.

నాగలాపురం- పీవీపురం మార్గంలో 19 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడానికి రూ.49 కోట్లు మంజూరైనప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

ఈ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెందిన పీఎల్ఆర్ సంస్థ దక్కించుకుంది. అందులో ఎక్కువ డబ్బు మిగలదనే ఉద్దేశంతో తిరిగి అంచనాలు పెంపొందించారు.

సుగర్ ఫ్యాక్టరీల బకాయిలు విడుదలచేసి ఆదుకుంటాం

నిండ్ర, బీఎన్ కండ్రిగలో చక్కెర కర్మాగారాలను మూసేశారు. వీటి నుంచి రూ.60 కోట్ల వరకు బకాయిలు రావాలి. 6వేల రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

బకాయిలు ఇప్పిస్తామని వైకాపా నాయకులు చెప్పినా ఇప్పటి వరకూ ఇది కార్యరూపం దాల్చలేదు.

అరణియార్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం తెదేపా హయాంలో రూ.32 కోట్లు మంజూరయ్యాయి. 

రూ.6 కోట్లతో గుత్తేదారు పనులు చేసినా రూ.4 కోట్లు బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపేశారు. 

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు చేస్తాం.

సత్యవేడు నియోజకవర్గంలో మూడున్నర ఏళ్లుగా రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాగు చేయిస్తాం.

యుద్దం ఇప్పుడే మొదలైంది...ఇది పాదయాత్ర కాదు..దండయాత్ర. సినిమా ఇప్పుడే స్టార్ట్ చేశా..అసలు సినిమా ముందుంది.


Comments