ఒక్క అవకాశం ఇస్తే గుడివాడలో రౌడీయిజాన్ని అంతం చేస్తా

 *- ఒక్క అవకాశం ఇస్తే గుడివాడలో రౌడీయిజాన్ని అంతం చేస్తా*


 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 

 *- ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనూహ్య స్పందన* 

 *- గుడివాడ 9వ వార్డులో ప్రజలకు అవగాహన* 



గుడివాడ, ఫిబ్రవరి 6 (ప్రజా అమరావతి): 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గంలో రౌడీయిజం, గూండాయిజాన్ని అంతం చేస్తానని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. సోమవారం గుడివాడ పట్టణం 9వ వార్డులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది, టీడీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వార్డులోని ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి మీడియాతో మాట్లాడుతూ పేదప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కుంటి సాకులతో రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డి మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ దోపిడీ విధానాలను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. అన్నివర్గాల ప్రజలు గత నాలుగేళ్ళుగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని తెలిపారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పేదప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నామన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు గత 20ఏళ్ళుగా మోసపోతూనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని దోపిడీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇసుక, మట్టి అమ్మకాలతో వేలకోట్లు దోచుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి బొమ్మ చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. యువతను బలోపేతం చేసే లక్ష్యంతో లోకేష్ పాదయాత్ర జరుగుతోందన్నారు. 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే రావి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు, టీడీపీ మహిళాధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, పండ్రాజు సాంబశివరావు, దాసు శ్యామ్, షేక్ సర్కార్, షేక్ జబీన్, షేక్ జానీ షరీఫ్, షణ్ముఖ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments