జగనన్న విదేశీ విద్యా పథకం కోసం జిల్లాలో ముగ్గురు ఎంపిక*
*: ఈనెల 3వ తేదీన నిర్వహించే జగనన్న విదేశీ విద్యా పథకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 02 (ప్రజా అమరావతి):
జగనన్న విదేశీ విద్యా పథకం కింద జిల్లాలో ముగ్గురు ఎంపిక కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో జగనన్న విదేశీ విద్యా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన విద్యార్థుల దరఖాస్తులు స్క్రూటిని అనంతరం జిల్లాలో ఒక్కరు బిసి, ఇద్దరు ఈ బీసీ లు విద్యార్థులు విదేశీ విద్యా పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ గురువారం ప్రకటనలో తెలిపారు.
ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా జగనన్న విదేశీ విద్య కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అవలంభించిన పాత విధానాన్ని మెరుగుపరచడం మరియు విదేశీ విద్యాసంస్థలలో గుణాత్మక విద్యపై దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ దృక్కోణంలో అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారిని స్వావలంబనగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. విద్యార్థి చెల్లించవలసి ఉన్న పూర్తి ఫీజులో రూ. 50 లక్షల వరకు రీయింబర్స్‌మెంట్ మొత్తం నాలుగు వాయిదాల రూపంలో నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలకు పంపబడుతుందన్నారు.
ఈ పథకం ద్వారా విదేశాల్లో టాప్ 200 విశ్వవిద్యాలయాలలో అమలు చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.15 లక్షలు, బీసీ, కాపు అభ్యర్థులకు రూ.10 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాడమే కాకుండా రూ.50 లక్షల వరకు ఫీజ్ రియంబర్స్మెంట్ చేస్తుడడం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీన అర్హులైన విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నారు.
పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, ఎంపీ, ఎమ్మెల్యేలు, పుర ప్రముఖులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. డి.అనిత ఇటలీ దేశంలో Alma mater studiorm విశ్వవిద్యాలయం నందు ఎమ్మెస్సీ సివిల్ ఇంజనీర్ చదువుటకు బీసీ కులం చెందినవారు ఎంపికయ్యారు. ఈబీసీకి చెందిన ఇద్దరు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు కే.రాజశేఖర్ రెడ్డి, ఇంజనీరింగ్ USA న్యూయార్క్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి ఎన్నికయ్యాడు. రెండవ వ్యక్తి జి.భార్గవ సాయి, USA బోష్ణ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించడానికి ఎన్నికయ్యారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం పేద విద్యార్థులకు వరం లాంటిదన్నారు. మొట్టమొదటిసారిగా నిర్వహించే జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం గురించి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండేటట్టు చూడాలన్నారు.
addComments
Post a Comment