*జగ్గంపేటలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో*
• గతంలో అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. కానీ ఈ స్ధాయి జన స్పందన ఎప్పుడూ లేదు. యువత, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు
• జగన్ ఒక అవకాశం అని వచ్చాడు...అతనికి అదే చివరి అవకాశం.
• జగన్ పని అయిపోయింది. ఇంటికి పోవడం ఖాయం
• జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడ్డారు. సర్వ నాశనం అయ్యారు.
• ప్రజా తిరుగుబాటు ముందు ఎవరైనా తవంచాల్సిందే.
• రాష్ట్రంలో నిన్నటి వరకు పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ రాజ్యం చేశాడు
• కానీ ఆ పోలీసులకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించడం లేదు.
•జగన్ అందరినీ మోసం చేసినందుకు ఫ్యానును ఈ సారి ఎన్నికల్లో చితక్కొట్టాలి.
• దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే ఎక్కువ.
• 7 సార్లు కరెంట్ చార్జీలు పెరిగాయా లేదా...చేతగాని దద్దమ్మ పాలన వల్లనే కరెంట్ చార్జీలు పెరిగాయి.
• ఆర్టీసీ చార్జీలు, మద్యం రేట్లు సహా అన్నీ పెరిగాయి.
• ఏ మద్యం షాపులో చూసినా జె బ్రాండ్స్ తోనే అమ్మకాలు చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఎందుకు ఆన్లైన్ అమ్మకాలు జరపడం లేదు.
• నా జీవితంలో ఎవరూ నాపై కేసులు పెట్టలేదు....కానీ ఈ సైకో సిఎం కేసులు పెట్టాడు.
• ఎన్నికేసులైనా పెట్టుకో...ఈ సైకోలకు నేను భయపడను. టీడీపీ కార్యకర్తలు కూడా భయపడాల్సిన పనిలేదు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటా
• ఒక సైకో కాదు...ఊరుకో సైకో తయారు అయ్యాడు.
• జగన్ పాలనలో రైతులు చితికిపోయారు..ధాన్యం డబ్బు రావడం లేదు...వ్యవసాయం లాభసాటిగా లేదు.
• రాష్ట్రం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే
• పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి చేసింది మా ప్రభుత్వమే.
• పోలవరం ప్రాజెక్టును ఈ ముఖ్యమంత్రి గోదాట్లో ముంచేశాడు.
• 28 సార్లు పోలవరం విజిట్ చేశాను....78 సార్లు రివ్యూ చేశాను. నాడు 72 శాతం పనులు పూర్తి చేశాం.
• ఈ సైకో సిఎం రివర్స్ టెండరింగ్ అని పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడు
• దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు.
• రైతులు ఎందుకు అప్పుల్లో కూరుకుపోయారో చెప్పే దైర్యం జగన్ మోహన్రెడ్డికి ఉందా.
• ఆక్వా, హార్టికల్చర్ సహా అన్ని రకాల రైతులు నాశనం అయ్యారు.
• జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా ఎపిలో భూముల రేట్లు కూడా పడిపోయాయి. ఒకప్పుడు తెలంగాణలో మనకంటే తక్కువ రేట్లు ఉండేవి.కానీ ఇప్పుడు మన దగ్గర భూముల రేట్లు తగ్గాయి. తెలంగాణలో పెరిగాయి.
• ఒక ప్రాజెక్టు తెస్తేనో...ఒక పరిశ్రమ తెస్తేనో ఆ ప్రాంతంలో భూముల రేట్లు పెరుగుతాయి. కానీ అవేమీ చెయ్యని కారణంగా రాష్ట్రంలో భూముల రేట్లు తగ్గిపోయాయి.
• అమరావతి కట్టండి నేను సహకరిస్తాను అని నాడు జగన్ సభలో చెప్పాడు...తరువాత మాట మార్చాడు.
• జగన్ మాటలు మార్చడం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది.
• ఆర్థిక మంత్రి బెంగుళూరు వెళ్లి మూడు రాజధానులు అని మేం అనలేదు అంటున్నాడు. ఒకటే రాజధాని అని ఇప్పుడు అంటున్నాడు
• సైకో జగన్ రెడ్డి మూడు రాజధానులు అని సభలో చెప్పాడా లేదా
• కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పాడా లేదా...వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని అని చెప్పాడా లేదా
• అసెంబ్లీలో బిల్లులు పెట్టాడు...దానిపై గట్టిగా పోరాడాం. కౌన్సిల్ లో అడ్డుపడితే కౌన్సిల్ రద్దు అన్నాడు.
• సుప్రీం కోర్టులో కేసు ఉంటే ప్రభుత్వ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారు.
• రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు. ఆ రెండు కళ్లు జగన్ పొడిచేశాడు.
• ప్రజల్లో చైతన్యం లేకపోతే ఇలాంటి పాలకులు ఇష్టం వచ్చినట్లు చేస్తారు
• రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి వచ్చిందా. నాడు 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
• కియా సహా అనేక పరిశ్రమలు నాడు రాష్ట్రానికి వచ్చాయి. మళ్లీ జాబు రావాలి అంటే టీడీపీ రావాలి.
• యువత,ప్రజలు ఇళ్లల్లో ఉంటే మనకు న్యాయం జరుగుతుందా...లేదు అంతా బయటకు రావాలి. యువత తమ భవిష్యత్ కోసం కదిలి రావాలి.నాతో కలిసి నడవండి. అంతా కలిసి పోరాడుదాం.
• నాకు అధికారం కొత్త కాదు. 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా పని చేశాను. కానీ నా ఆలోచన, బాధ అంతా రాష్ట్రం గురించి.
• నాడు హైదరాబాద్ లో ఐటి అనే విత్తనం వేస్తే.....అది ఇప్పుడు అద్భుత ఫలాలను ఇస్తుంది.
• సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని నాడు రాజశేఖర్రెడ్డి అన్నాడు...కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఏ పనీ కావడం లేదు.
• ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవడానికి సెల్ ఫోన్ ఉపయోగపడుంది. అలాంటి సెల్ ఫోన్ లను అందుబాటులోకి తేవడానికి నాడు చొరవ చూపాను.
• నాడు మన ప్రభుత్వ విధానాలతో ఐటి ఉద్యోగాలు పొందిన ఐటి ఉద్యోగులు తరువాత నన్ను మరిచిపోయారు.
• 2019లో నా మాట విని ఉంటే ఇప్పుడు ఈ కష్టాలు ఉండేవి కావు
• మళ్లీ మంచి రోజులు కావాలి అంటే టీడీపీని గెలిపించాలి.
• మళ్లీ మన ఇళ్లకు వచ్చి నా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు వేస్తాడట. ఇంటికి స్టిక్కర్లు వేయనిస్తారా...
• పథకాలు పోతాయని, ఉద్యోగాలు పోతాయని మీరు భయపడి స్టిక్కర్లు అంటించుకోకండి.
• జగన్ జీవో నెంబర్ 1 అని గ్రేట్ జీవో ఒకటి తెచ్చాడు. యువగళం మీటింగ్ పెడుతుంటే పోలీసులు మైక్ లాక్కుంటారు..వీళ్లేం పోలీసులు
• పోలీసులు కూడా అలా వ్యవహరించకూడదు...రాష్ట్రంలో పోలీసులు కూడా భాగస్వాములే.
• మీ తండ్రి తాత మీకు ఆస్తులు ఇస్తే....మీ పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటో ఎలా వేసుకుంటాడు....ఆ దరిద్రమైన ఫోటో మనం ఎందుకు చూడాలి
• ఎవరూ ఇంత దారుణమైన ఆలోచన చెయ్యలేదు.
• భూముల సర్వే అని కార్యక్రమం మొదలు పెట్టాడు...ఆ సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకుంటాడంట.
• జగన్ నాలుగేళ్లలో ఒక్క పని చేశాడా.....జగన్ చేసిన పని ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ కు రెండు సార్లు ఫౌండేషన్ వేశాడు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి
• 10 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఈ ప్రభుత్వంపై ఉన్నాయి.
• ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నాడు
• దక్షిణ భారత దేశంలో ప్రజల తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఎపి....ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం ఎపినే.
• జగన్ చేసిన అప్పులతో ప్రతి వ్యక్తిపై 2 లక్షల రూపాయల అప్పు ఉంది
• మద్య నిషేదం చేస్తానని చెప్పిన సిఎం...ఆ మద్యం ఆదాయం పై అప్పులు తెచ్చాడు
• రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి సరఫరా జరుగుతోంది
• పిల్లలకు గంజాయి అలవాటు అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్క సారి గంజాయికి అలవాటు పడిన వాడిని మనం మార్చలేం.
• రేపు అన్ని విషయాల్లో మనం మార్పు తేవచ్చు...కానీ గంజాయికి అలవాటు పడిన వాడిని మనం మార్చలేం.
• తాడేపల్లి సిఎం నివాసం దగ్గర ఒక అంధురాలిని గంజాయి మత్తులో ఒకడు చంపేశాడు. అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి.
• దేశంలో ఎక్కువ గంజాయి సరఫరా అవుతున్న రాష్ట్రం మన ఎపి.
• అందుకే సైకో సిఎంను ఇంటికి పంపాలి. జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.
• వివేకా నంద రెడ్డి ని నేను హత్య చేశాను అని ఆరోపించాడు..ఇప్పుడు నిజాలు భయపడుతున్నాయి.
• బాబాయిని చంపిన వాడిని ఏమనాలి.
• ప్రజలను బెదిరించి, మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. విశాఖలో ఇలాగే ప్రైవేటు ఆస్తులు రాయించుకున్నారు.
• కాకినాడ పోర్టు, కృష్ణపట్నంపోర్టు లను ఇలాగే లాక్కున్నారు.
• జగ్గంపేట ఎమ్మెల్యే పెద్ద ఘనుడు....రామేశ్వరం పేటలో 200 ఎకరాల్లో గ్రావెల్ కొట్టేశాడు
• రిషికొండను కొట్టేసిన పెద్ద అనకొండ జగన్...ఇక్కడ చిన్న అనకొండ మీ ఎమ్మెల్యే
• అక్రమంగా చేపల చెరువులు, పేదల ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు.
• ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం 823 ఇళ్లు కట్టారు. ఇళ్ల స్థలాల పేరుతో రూ.6 వేల కోట్లు దోచుకుని నాలుగేళ్లలో 823 ఇళ్లు కట్టాడు.
• నాడు పెద్ద ఎత్తున టిడ్కో ఇళ్లు కడితే వాటినీ లబ్దిదారులకు ఇవ్వలేదు.
• పోలవరం నిర్వాసితులకు కట్టిన ఇళ్లూ ఇవ్వలేదు.
• స్థానిక ఎమ్మెల్యే పేదల ఇళ్ల స్థలాల్లో ఎకరానికి 24 లక్షలు కాజేశాడు
• ఈ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ చెరువును చేపల చెరువుగా మార్చాడు....విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్యోగాలుకూడా అమ్ముకున్నారు ఎమ్మెల్యే
• రాష్ట్రంలో జగన్ హోల్ సేల్ గా దోపిడీ చేస్తున్నడు.
addComments
Post a Comment