ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను (ఎఫ్ ఎస్ టి) ఏర్పాటు


నెల్లూరు, ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి): జిల్లాలో మార్చి 13వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శక సూత్రాల ప్రకారం నగదు, మద్యం తరలింపు, ఇతర వస్తువుల పంపిణీ పై పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను (ఎఫ్ ఎస్ టి) ఏర్పాటు


చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఈ బృందాలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. అలాగే మద్యం, నగదు, ఇతర వస్తువుల తరలింపు, పంపిణీ పై అందిన ఫిర్యాదులను నమోదు చేసి, సరైన ఆధార పత్రములు లేని నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసే అధికారం ఈ బృందాలు కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ  ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలపై గట్టిగా నిఘా ఉంచి, ఎవరైనా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారికి ఈ బృందాలు సిఫార్సు చేస్తాయి. 


Comments