ఎమ్మెల్సీలలో సామాజిక న్యాయానికే సీఎం జగన్ ప్రాధాన్యత

 ఎమ్మెల్సీలలో సామాజిక న్యాయానికే సీఎం జగన్ ప్రాధాన్యత 


  కాకినాడ, ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి): ఇటీవల ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 4 నాలుగు మాత్రమే ఇతర వర్గాల వారికి కేటాయించి మిగిలిన 14ను సామాజిక న్యాయం కూర్చి ఆయా వర్గాలకు సీఎం జగన్ ఎమ్మెల్సీలుగా అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీగా నూతనంగా ఎంపికైన కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని ఎమ్మెల్యే ద్వారంపూడి కార్యాలయంలో ద్వారంపూడి, పద్మశ్రీలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ప్రసంగించారు.    

   ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ గవర్నర్ కోటాలో కాకినాడ నగరానికి చెందిన కర్రి పద్మశ్రీని ఎంపిక చేయడం కార్యకర్తకు ఒక మంచి గుర్తింపుగా అభివర్ణించారు. వైకాపా అధికారంలోకి రావడం కోసం పని చేసిన వారందరికీ సీఎం జగన్ గుర్తించి పదవులు ఇస్తున్నారని చెప్పారు. ఇటీవల జిల్లా పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు తనను బియ్యం ఎగుమతులలో అక్రమాలు సాగిస్తున్నారంటూ సభల్లో సభల్లో చెప్పారన్నారు. తాను ఎటువంటి బియ్యం ఎగుమతికి సంబంధించిన అక్రమాలకు పాల్పడడం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి దూరమవుతానని లేనిపక్షంలో చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల నుంచి విరమించేలా చేస్తారా అని చంద్రబాబును ద్వారంపూడి ప్రశ్నించారు. కాకినాడలో పారిశుద్ధ్యం బాగా లోపించిందని దీనిపై శ్రద్ధ వహించి పారిశుద్ధ్యన్ని మెరుగుపడేలా చర్యలు చేపడతానన్నారు. నూతన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ సామాజిక న్యాయంలో భాగంగా సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తాను మహిళలకు స్వయం  సమృద్ధి అభివృద్ధికి, పిల్లల ఉపాధి అవకాశాలకు తన వంతు కృషి చేస్తానని పద్మశ్రీ చెప్పారు.

   ఈ సమావేశంలో నాయకులు కాటాడి జానకిరామ్, రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సుంకర శివప్రసన్న, మీసాల ఉదయ్ కుమార్, చోడిపల్లి సత్యప్రసాద్, కర్రి నారాయణ రావు, గోడి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Comments