పేర్నాటి, పర్వత రెడ్డిల నామినేషన్ కు హాజరైన మంత్రులు.

 *"పేర్నాటి, పర్వత రెడ్డిల నామినేషన్ కు హాజరైన మంత్రి కాకాణి"*చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);చిత్తూరు జిల్లా, కలెక్టర్ కార్యాలయంలో బుధవారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయుల శాసనమండలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ల నామినేషన్ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులురెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మంత్రులు ఆదిమూలపు సురేష్ గారు, రోజా గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు స్థానాలను కూడా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.


పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీ నడుమ కోలాహలంగా సాగింది.

Comments