రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యత నిచ్చి అనేక పథకాలు అమలు చేస్తుంది



 తాడేపల్లిగూడెం,ఫిబ్రవరి.07 (ప్రజా అమరావతి);

  

    *రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యత నిచ్చి అనేక పథకాలు  అమలు చేస్తుంద


ని, విద్యా విధానం లో మార్పులు తీసుకు రావడం జరిగిందని  రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స. సత్యనారాయణ తెలిపారు* ...

    

      మంగళవారం తాడేపల్లిగూడెం లోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ లో బి ఫార్మాసి భవనం, మహిళా హాస్టల్  భవనాలు ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు రావాలని నేషనల్ ఎడ్యుకేషన్ ఫాలసీని అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

స్కూల్ ఎడ్యుకేషన్ లో  3 వ తరగతి నుండే ప్రతీ  సబ్జెక్టు టీచర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ లో చివరి 6 మాసాలు  ఇటర్న్ షిప్ ఆమలు చేసి  ప్రపంచ స్థాయిలో  విజయాలు సాధించే విధంగా  ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు పైన కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం విద్య కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కుటుంబంలో ఒకరు చదువుకుంటే ఆ కుటుంబం స్వరూపమే మారిపోతుందని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. మీరు జీవితంలో ఏది అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే నిర్ణయించుకుని ఆ దిశగా పయనించాలని ఆయన సూచించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో   హాస్టల్లో  వసతులు 15 రోజుల్లోగా పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చాలని రిజిస్టర్ కు చూచించారు.  ఐదు కోట్లతో  యూనివర్సిటీ కి వచ్చే రోడ్డు పనులు చేపట్టాలని ఆయన సూచించారు. కళాశాలలో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తెలియజేయాలని, వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఆయన  అన్నారు. ఈరోజు ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బీఫార్మసీ కాలేజ్ భవనం,  మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్  భనాలను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు . యూనివర్సిటీ ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి  కొట్టు. సత్యనారాయణ మాట్లాడుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్ కు  150 కోట్ల విలువైన భూములను గతంలో  కేటాయించడం జరిగిందని తెలిపారు.  క్యాంపస్ లో  స్టాపు  కెడర్  స్టాంత్ ఎవరూ లేరని,  అడహాక్  పద్ధతి మీదగా పనిచేస్తున్నారని అన్నారు.   యూనివర్సిటీకి క్యాడర్  స్ట్రేంత్   స్టాఫ్ ను కేటాయించాలని మంత్రి కోరారు. యూనివర్సిటీ లో  ప్లే గ్రౌండ్  , రోడ్లు అభివృద్ధి చేయాలని  అన్నారు. ఎం ఫార్మసీ  , ఎంకాం  , ఎం సీఏ ,  ఎంఎస్సీ డేటా ఎనాలసిస్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఆయన విద్యాశాఖ మంత్రిని కోరారు. తాడేపల్లిగూడెంలో మహిళ ఇంజనీరింగ్ కళాశాలను కూడా మంజూరు చేయాలని మంత్రి కోరారు.


 రాష్ట్ర పౌరసరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి. వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా చదువుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  దేశంలో   14 వ స్థానంలో ఉన్న విద్యను రెండో స్థానంకు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యకు వేలాది కోట్లు ఖర్చు చేసి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.


  ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ జీ .వి.  ప్రసాద రాజు ,  జిల్లా ఎస్పీ యు. రవి ప్రకాష్ , జిల్లా జాయింటు కలెక్టర్ జె .వి .మురళి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టర్ అశోక్ ,  ప్రిన్సిపాల్ రమేష్, భీమవరం  ఆర్ డి ఓ దాసి రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.



 

Comments