కియా ఇండియా అందించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి.

 కియా ఇండియా అందించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

*


*: నిరుద్యోగ యువత ఎప్పటికప్పుడు సరైన నైపుణ్యాలు నేర్చుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా), ఫిబ్రవరి 22 (ప్రజా అమరావతి): 


కియా ఇండియా అందించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ మండలంలోని దుద్దెబండ క్రాస్‌లోని కియా ఇండియా ట్రైనింగ్ సెంటర్‌లో సిఎస్ఆర్  కార్యక్రమంలో భాగంగా  నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న కియా ఇండియా ఆటో సర్వీస్ టెక్నీషియన్ ప్రోగ్రామ్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ, లీగల్  హెచ్ఓడి యోంగిల్ మా, టి అండ్ డి హెచ్ఓడి బైంగీ హన్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి  శిక్షణ కార్యక్రమాలపై ప్రభుత్వం ఎంతగానో దృష్టి పెట్టిందన్నారు. జిల్లాలో ఉన్న ముఖ్యమైన పరిశ్రమలలో కియా ఇండియా ఒకటి అన్నారు. ఇక్కడ శిక్షణ అందించేందుకు కోసం మంచి క్లాస్ రూమ్, మంచి ఫ్యాకల్టీ, ల్యాబ్ అటాచ్డ్ ఉండే క్లాస్ రూమ్, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ శిక్షణ పొంది సరైన నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా పనిచేసేందుకు వీలు కలుగుతుందన్నారు. పరిశ్రమరంగం చాలా మారిపోతుందని, ప్రతిరోజు కొత్త కొత్త కంపెనీలు ఏర్పడుతున్నాయని, కంపెనీలు కూడా నిలదొక్కుకునేందుకు మంచి  ఉత్పత్తులు కాలవ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, చైనా, ఫ్రెంచ్ కంపెనీలు  కొత్త టెక్నాలజీ తో వస్తున్నాయని, నిరుద్యోగ యువత నైపుణ్యాలలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. ఇలాంటి శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం దొరకదని, మంచి శిక్షణ అందించి ఉద్యోగ భరోసా ఇచ్చి స్టైఫండ్ ఇవ్వడం కొద్ది మందికి మాత్రమే అవకాశం దొరుకుతుందన్నారు. శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందన్నారు. శిక్షణాకాలంలో 100 శాతం దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో శిక్షణను ఉపయోగించుకోవాలన్నారు.


ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ మాట్లాడుతూ ఈ ఆటో సర్వీస్ టెక్నీషియన్ ప్రోగ్రామ్ ఆటోమొబైల్ సిస్టమ్‌లపై క్లాస్‌రూమ్ థియరీ మరియు హ్యాండ్-ఆన్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఈ అవకాశం ప్రతి ట్రైనీకి వారి ఉపాధిని పెంచుకోవడానికి వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో సహాయపడుతుందన్నారు. కియా ఇండియా ఆటో సర్వీస్ టెక్నీషియన్ ప్రోగ్రామ్ కింద అనంతపురం & శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. 3 నెలల పాటు ఆటో సర్వీస్ టెక్నీషియన్ ప్రోగ్రాం కింద 100 మంది స్థానిక యువతకు ఆటోమొబైల్ సెక్టార్‌లో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలతో శిక్షణనిస్తుందన్నారు. మొత్తం 55 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు బ్యాచ్ లలో ఈ ప్రాజెక్టు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.2025 సంవత్సరం నాటికి ఆటో రంగంలో మంచి విప్లమాతమైన మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. 


ఈ కార్యక్రమంలో సంభవ్ ఫౌండేషన్ ప్రతినిధి గాయత్రి వాసుదేవన్, తహసీల్దార్, నిరుద్యోగ యువత, తదితరులు పాల్గొన్నారు.Comments