ధాన్యం అమ్ముకోలేక ఇదేం ఖర్మ అంటున్న రైతులు

 *- ధాన్యం అమ్ముకోలేక ఇదేం ఖర్మ అంటున్న రైతులు


 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 

 *- కుచ్చికాయలపూడిలో రైతులు, గ్రామస్తులకు అవగాహన* 

 *- ఆలోచన చేసి చంద్రబాబును ఆశీర్వదించాలని వినతి*గుడ్లవల్లేరు /గుడివాడ, ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇదేం ఖర్మ  అంటున్నారని కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు అన్నారు. ఆదివారం గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.

టిడిపి శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు వచ్చిన రావికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.

రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు, గ్రామస్తులనుద్దేశించి రావి మాట్లాడుతూ రైతు ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తున్నాడన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అందిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యాన్ని అమ్ముకోలేక నష్టపోయిన రైతులు అపరాల విషయంలో కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులను ఆదుకోవాల్సిన  ప్రభుత్వాలు ఆదిశగా ఆలోచన చేయడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడం జరిగిందన్నారు. రైతులు ఆలోచన చేసి చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు. ఇంకోవైపు ప్రజలు కూడా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని మాజీ ఎమ్మెల్యే రావి హామీ ఇచ్చారు. ముందుగా గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి రామరాజు, పొట్లూరి ఈశ్వరావు, ఆడుసుమిల్లి రమేష్, ఆలూరి వెంకటేశ్వరావు, కొడాలి వెంకటేశ్వరావు, వూర సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Comments