మౌలిక సదుపాయాలు, మానవవనరులే పెట్టుబడులకు పునాది*ఆంధ్రావనికి నలుదిక్కులా..అవధి లేని అవకాశాలు : ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*'ఇన్ లాండ్ వాటర్ వే పాలసీ' తీసుకువస్తాం*


*త్వరలోనే పారిశ్రామిక ప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్*


*మౌలిక సదుపాయాలు, మానవవనరులే పెట్టుబడులకు పునాది**విశ్వనగరంలా..విశాఖపట్నం*


*26 నైపుణ్య కళాశాలల అభివృద్ధి దిశగా అడుగులు*


*బెంగళూరు పారిశ్రామిక సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


అమరావతి, ఫిబ్రవరి, 14 (ప్రజా అమరావతి); పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా..పుష్కలంగా అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల, వెలుపలా రవాణా ఖర్చు తగ్గించేందుకు 'ఇన్ లాండ్ వాటర్ వే పాలసీ'ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 27 ప్రాంతాలను గుర్తించామన్నారు. 2029 కల్లా 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో  నిర్వహించేలా ముందుకెళుతున్నట్లు మంత్రి వివరించారు. 26 నైపుణ్య కళాశాలల అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. బెంగళూరులోని ఐటీసీ హోటల్ వేదికగా మంగళవారం జరిగిన ఇండస్ట్రియల్ మీట్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, మానవవనరులే పెట్టుబడులకు పునాది అని తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  పారిశ్రామిక ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామన్నారు.


*3 కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్*


*వైజాగ్ లాంటి ప్రాంతం గ్లోబ్ లో ఎక్కడా దొరకదని మంత్రి బుగ్గన వెల్లడించారు.  అన్ని రంగాలకు, అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలున్నాయన్నారు. యువ నాయకుడు సీఎం జగన్ నాయకత్వంలో పారిశ్రామికాభివృద్ధి ప్రగతిలో దూసుకెళుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా విద్య, నైపుణ్యం, గృహ నిర్మాణం, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వ్యాపారంలో భాగంగా దేశవ్యాప్తంగా చుట్టి వచ్చిన పాతికేళ్ల క్రితం కాలంలో, చాలా తక్కువ పరిశ్రమలు మాత్రమే ఉండేవన్నారు. కానీ, ఇప్పుడు పరిశ్రమల హబ్ లు గా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా వంటి  ప్రధాన నగరాలు తయారయ్యాయన్నారు.  సామాజిక, ఆర్థిక , పర్యావరణ ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ప్రకటించిన అనువైన వాతావరణమున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ది నాలుగో స్థానమన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విస్తారమైన ల్యాండ్ బ్యాంక్  ఏపీ సొంతమన్నారు. ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలో  రూ.వెయ్యికోట్ల తోడ్పాటుతో పార్కును దక్కించుకున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమేనన్నారు. 3 కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ ప్రత్యేకతను వివరించారు. బల్లారిలో చిరుద్యోగి స్థాయి నుంచి వేలది మందికి ఉపాధినిచ్చే పారిశ్రామికవేత్తగా  ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి గారు ఎదిగిన తీరు ఆసక్తికరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మెచ్చుకున్నారు.


బెంగళూరులో జరిగిన పారిశ్రామిక సదస్సుకు  పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్,ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ ప్రత్యేక కార్యదర్శి సుందర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.Comments