రాష్ట్రంలో జగన్ ఇక స్కీం పెట్టాడు అంటే....అందులో స్కాం ఉంటుంది

 *పెద్దాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*

 

*రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ప్రసంగం*


పెద్దాపురంలో అఖండ స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు

మీ సమస్యలు తెలసుకోవడానికి....మీతో మాట్లాడడానికి వచ్చాను.

రాష్ట్రంలో ఒక సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

జగన్ సిఎం అయ్యి నాలుగేళ్లు అయ్యింది...నాలుగేళ్లుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. 

ప్రజలు అంతా ఇబ్బందుల్లో ఉంటే జగన్ చూసి అనందం పొందుతున్నాడు. ఇది సైకో లక్షణం

ప్రజల ఖర్చులు భారీగా పెరిగాయి...అన్ని ధరలు పెరిగాయి...బాదుడే బాదుడు...వీర బాదుడు.

ఏడు సార్లు విద్యుత్ ధరలు పెంచిన ప్రభుత్వం ఇది..నాడు విభజన కష్టాల్లో సైతం కరెంట్ చార్జీలు పెరగలేదు.

ఇప్పుడు నిత్యావసరవస్తువుల ధరలు అన్నీ భారీగా పెరిగాయి.

ప్రజలపై 48 రకాల పన్నులు వేసిన దొంగ ఈ జగన్ మోహన్ రెడ్డి

అన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వంతో ఇదేం ఖర్మ అంటున్నారు.

రాష్ట్రంలో జగన్ ఇక స్కీం పెట్టాడు అంటే....అందులో స్కాం ఉంటుంది


ఇసుక ఎందుకు బంగారం అయ్యింది...గోదావరి జిల్లాలో కూడా ఇసుక ఎందుకు దొరకడం లేదు.

మద్యంలో అన్నీ జె బ్రాండ్స్ వచ్చేశాయి. మందు బాబులు మద్యం మానెయ్యలేరని తెలిసి ధరలు పెంచాడు. సొంత  బ్రాండ్లు, నాణ్యత లేని బ్రాండ్లు తెచ్చాడు. ప్రజల ఆరోగ్య పాడవుతున్నాజగన్ కు పట్టడం లేదు

జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి చనిపోతే కూడా ప్రభుత్వం స్పందించలేదు.

మద్యం షాపుల్లో అన్ లైన్ పేమెంట్స్ ఎందుకు లేదు...ఏంటి చిదంబర రహస్యం

మద్యం అమ్మకాల డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కు పోతుంది.....అందుకే ఆన్ లైన్ అమ్మకాలు చెయ్యడం లేదు

వెంకటేశ్వరస్వామికి మనం నిలువు దోపిడీ ఇస్తాం...కానీ జగన్ మనల్ని నిలువు దోపిడీ చేస్తున్నాడు

పెద్దాపురంలో కొండలను కొట్టేస్తున్నారు....టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా.

ఎప్పుడూ చూడని స్థాయిలో బరితెగించి కొండలను కొట్టేస్తున్నారు.

బాబు వస్తేనే జాబు వస్తుంది అని యువత నమ్ముతున్నారు. విద్యార్థులు కూడా అదే మాట అంటున్నారు.

జగన్ తెలివైన దొంగ...ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నాడు..కానీ ఫైన్ లువేసి, పెట్రోల్ ధర పెంచి..వేలకు వేలు దోచేస్తున్నాడు. అధ్వాన్న రోడ్ల కారణంగా ఆటోల రిపేర్లకు అదనంగా ఖర్చు అవుతుంది. 

ఇలా వాళ్ల జేబులకు చిల్లు పెట్టి...వాళ్లకు మేలు చేస్తున్నా అని చెపుతున్నాడు....అందుకే జగన్ ను తెలివైన దొంగ అంటున్నాను.

జగన్ ఒక కోడికత్తి కమల హాసన్. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారట. జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి.

అమరావతిపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుంది.

మొన్న డిల్లీ వెళ్లి సిఎం వైజాగ్ రాజధాని... వెళుతున్నాం అన్నాడు....నిన్న మంత్రి బుగ్గన బెంగుళూరు వెళ్లి మూడు రాజధానులు కాదు అంటాడు...మళ్లీ సకల జనుల మంత్రి వచ్చి లేదు మూడు రాజధానులే అంటారు.

ఎన్నికల ముందు అమరావతే రాజధాని  అని జగన్ చెప్పాడు....2019లో మూడు రాజధానులు అని బిల్లులు పెట్టాడు.

ఎన్నికల ముందు ఎందుకు మూడు రాజధానులు అని జగన్ చెప్పలేదు.

2021లో మూడు రాజధానుల బిల్లును మళ్లీ వెనక్కి తీసుకున్నారు. బిల్లును వ్యతిరేకించారని మండలినే రద్దు చెయ్యాలని తీర్మానం చేశారు.

మూడు రాజధానుల విషయంలో హైకోర్టు 2021 మార్చిలో తీర్పు చెప్పింది. విభజన చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటు అయ్యిందని స్వయంగా కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది.

కేంద్రం చెయ్యాల్సిన చట్టంలో తనకు అధికారం ఉందని అంటాడు. 10వ తరగతి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ. 

జగన్ 10 తరగతి ఫెయిల్ అయ్యి ముఖ్యమంత్రి అవుతాడు...కానీ ప్రభుత్వ పథకం రావాలి అంటే 10 తరగతి పాస్ అవ్వాలి అని నిబంధన పెడతాడు.

పోలవరం ప్రాజెక్టును గోదాట్లో కలిపేశాడు. యువతకు ఉద్యోగాలు లేవు. మళ్లీ ఉద్యోగాలు రావాలి అంటే తెలుగు దేశం ప్రభుత్వం రావాలి

జగన్ నాలుగేళ్లలో పేదలకు ఇళ్లు కూడా కట్టేలేదు. కేంద్రం రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేస్తే నాలుగేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 823 

పేదలకు ఇళ్ల స్థలాల పేరులో రాష్ట్రంలో రూ. 6 వేల కోట్ల అక్రమాలు చేశారు

నా జీవితంలో ఇంత దోపిడీ దారును నేను ఎప్పుడూ చూడలేదు

అన్న క్యాంటీన్ లేదు, చంద్రన్న భీమా లేదు, పండుగ కానుకలు లేవు.

300 యూనిట్లు కరెంట్ వాడితే పథకాలకు కోతలుపెడుతున్నాడు. పిల్లలు ఎవరైనా ఇన్కంటాక్స్ కడితే కూడా ఇంట్లో వాళ్లకు పథకాలు రద్దు చేస్తున్నారు.

పెన్షన్ ను 200 నుంచి 2000 చేసిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం. 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఇప్పటికే 3000  రూపాయలు అయ్యేది.

జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచలేదు...ఒక్కొ వ్యక్తికి 18 వేల రూపాయలు జగన్ బాకీ ఉన్నాడు.

కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం రావడం లేదు...ఆదరణ లేదు...సబ్ ప్లాన్ లేదు...రైతు సబ్సిడీలు లేవు...ఆక్వా రైతులకు సబ్సిడీలు లేవు

ఇవన్నీ లేకుండా చేసి....10 రూపాయలు ఇచ్చి 90 దోచుకోవడం సంక్షేమమా?

సంక్షేమం అనేది ప్రారంభించింది తెలుగు దేశం పార్టీ. భవిష్యత్ లో కూడా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చేది టీడీపీ నే

పేదలకు, ధనికులకు మధ్య అంతరం తగ్గిస్తాం.

రాష్ట్రంలో రెండు వేల రూపాయల నోటు కనిపించడం లేదు. అన్నీ తాడేపల్లి ప్యాలెస్ కే పోతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇసుక ద్వారా సెంట్రలైజ్డ్ అవినీతి...ఇక ఇప్పటి నుంచి మైనింగ్ ద్వారా కొత్త తరహా అవినీతికి నాంది పలికాడు.

మైనింగ్ శాఖలో సీనరేజ్ వసూలు చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నాడు

ప్రజలకు పంచే రేషన్ బియ్యంలో కూడా అక్రమంగా సంపాదిస్తున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో బియ్యం మాఫియా నడుస్తోంది.

అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్ల తోకలు కట్ చేస్తా

ప్రజల రక్తాన్ని తాగే జలగలు ఈ వైసిపి దొంగలు

రాబోయే ఎన్నికల్లో పేదలకు ధనికులకు యుద్దం అని జగన్ అంటున్నాడు...జగన్ అందరికంటే నిరుపేద అన్నట్లు చెపుతున్నాడు.

దేశంలో అందరి ముఖ్యమంత్రుల సంపద కలిపినా జగన్ సంపదలో సగం లేదు.

దేశంలో ఎక్కువ డబ్బులు ఉన్న వాడు...పేదలకు, ధనికులకు యుద్దం అని ప్రచారం చేస్తున్నాడు

కులాల మద్య ప్రాంతాల మద్య చిచ్చు పెట్టడం అలవాటు అయిన  ఈ జగన్...కొత్త గా గొడవలు పెట్టాలి అనుకుంటున్నాడు

రూ.5 వేలు, రూ. 10 వేలు తీసుకుని రేపు ఓటువేస్తారా...జగన్ గెలుపుకోసం రకరకాల విన్యాసాలు చేస్తాడు. జాగ్రత్త గా ఉండాలి

రేపు ఎన్నికలు అనేవి మన భవిష్యత్...ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

బాబాయ్ హత్యపై జగన్ సమాధానం చెప్పాలి. నాడు తెల్లవారు జాము 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫోన్లు ఎవరెవరు మాట్లాడారు..ఎవరితో మాట్లాడారు

మీ పొల సర్వే చేసి జగన్ తన బొమ్మలు వేసుకుంటాడంట. మీ పొలమ్ పట్టాపై దరిద్రపు మొఖం చూసుకోవాలా..

ఇన్నేళ్లలో ఎవరైనా ఇలాంటి ఆలోచనలు చేశారా.

మీ ఇంటికి వచ్చి ఇప్పుడు స్టిక్కర్ లు వేస్తాడంట. మా నమ్మకం జగన్ అని స్టిక్కర్ వేస్తాడంట. 

పొలం మాది....సర్వే రాయి మీద బొమ్మ జగన్ ది

ఇల్లు నాది...స్టిక్కర్ నీది.....పట్టాదారుపుస్తకం నాది...బొమ్మ జగన్ ది....స్టిక్కర్ వెయ్యనిస్తారా

ప్రజలు పౌరుషం చూపాలి....ప్రజల ఆస్తుల మీద నువ్వు బొమ్మలు వెయ్యడానికి అది నీ అబ్బ సొత్తు కాదు.

నాడు పోలీసులు సమర్థంగా పనిచేశారు. కడపలో జగన్ కుటుంబ అరాచకాలను అణిచివేసింది ఈ పోలీసులే. నాడు రౌడీలను అణిచివేసింది ఈ పోలీసులే.

అయితే పోలీసుల మెడమీద కత్తిపెట్టి జగన్ వాళ్లతో తప్పుడు పనులు చేయిస్తున్నాడు

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గట్టిగా పోరాడే వాళ్లు...ఇప్పుడు వాళ్లు జీతాల పెంపు కాదు....కనీసం జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితి వచ్చారు.

1 తారీకు కాదు...కనీసం 10 తారీఖున జీతాలు ఇచ్చినా చాలు అనే పరిస్థితికి వచ్చారు.

పోలీసులకు డిఎ లేదు, ఇతర చెల్లింపులు లేవు. రేపు ఈ పోలీసులకు న్యాయం చెయ్యాలి అన్నా చెయ్యాల్సింది నేనే

పోలీసులు మంచోళ్లే...కానీ ప్రభుత్వ ఒత్తిడికి లోనవుతున్నారు.

ప్రజలు తమ ఆస్తులు జాగ్రత్తగా చూసుకోవాలి....ఈ దుర్మార్గులు వ్యక్తి గత ఆస్తుల మీద పడ్డారు.

విశాఖ పట్నంలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల ఎన్ఆర్ఐ భూమిని కొట్టేసే ప్లాన్ చేశారు.

లలితేష్ అనే వ్యక్తి భూమికి కొట్టెయ్యాలని వైసిపి నాయకులు పథకం వేసుకున్నారు. రాసిఇవ్వమన్నారు. నో అనడం తో ఆ భూమిపై లిటిగేషన్ పెట్టారు. అయితే కోర్టుకు వెళ్లి యజమాని రక్షణ పొందాడు. అయితే మళ్లీ కోర్టుకు వెళ్లి ఆ యజమానిని ఇబ్బంది పెడుతున్నారు.

విశాఖలో దస్ పల్లా భూములు, బే పార్క్, వాల్తేర్ భూములు, కార్తీక వనం, ప్రేమ సమాజం ఇలా అనేక భూములు, ఆస్తులు కోట్టేశారు.

ప్రైవేటు వ్యక్తులు భూములు వాళ్లకు ఇవ్వకపోతే వాటిని 22 ఎ లో పెట్టి లిటిగేషన్ లో పెడుతున్నారు.

ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక ఎన్ ఆర్ ఐ తన ఆస్తి కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి.

ఇక్కడ ఉన్న కాకినాడ పోర్టు కూడా అలాగే రాయించుకున్నారు.

జీవితం అంతా కష్టపడి సంపాదించిన ఆస్తులను మెడమీద కత్తిపెట్టి రాయించుకుంటున్నారు. 

పెద్దాపురంలో రాజప్ప 1500 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది చేశారు. నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా అభివృద్ది పనుల కోసమే వచ్చారు.

ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రాజప్ప డిప్యూటీ సిఎంగా ఉండి కట్టించినవే.

వైసిపి వచ్చింది సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ మటాష్

ఇళ్ల స్థలాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. రామేశ్వరం మెట్ట రెవెన్యూ భూమిని కరిగిపోయింది.

చరిత్రలో ఇంతటి అవినీతి ఎప్పుడూ జగరలేదు.

అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ అవసరం అయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.

ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వచ్చాను....రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

జగన్ కు..మా దరిద్రం నువ్వే జగన్ అని చెప్పాలి

ఈ రాష్ట్రానికి పట్టిన శని...ఐదేళ్ల శని అదే జగన్ మోహన్రెడ్డి

రాష్ట్రంలో సైకో పాలన పోవాలి.....సైకిల్ పాలన రావాలి.

Comments