వెణుతురుమిల్లిలో బాధిత దళిత కుటుంబానికి అండగా ఉంటాం

 *- వెణుతురుమిల్లిలో బాధిత దళిత కుటుంబానికి అండగా ఉంటాం* 


 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు* 

 *- వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సాయం*


 గుడ్లవల్లేరు /గుడివాడ, ఫిబ్రవరి 24 (ప్రజా అమరావతి): గుడ్లవల్లేరు మండలం వెణుతురుమిల్లిలో బాధిత దళిత కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు చెప్పారు. గ్రామానికి చెందిన దివి కొండబాబు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రావి  కొండబాబును కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. పదివేల ఆర్థిక సాయం అందజేశారు. కొండబాబు త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments