సత్ఫలితాలను ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ.


కాకినాడ జిల్లా (ప్రజా అమరావతి)!*సత్ఫలితాలను ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ.**ప్రేమించిన మహిళను దారి కాచి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు గుబ్బల వెంకట సూర్యనారాయణ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్, కాకినాడ.*


గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర DGP రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా    SP శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు గారి నిరంతర పర్యవేక్షణలో సత్ఫలితాలను ఇస్తున్న   కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన మహిళా హత్య  ఘటన లో  దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతి స్వల్పకాలం లో(కేసు నమోదు జరిగిన కేవలం 144 రోజులలోపే (నాల్గున్నర నెలలలోనే)విచారణ జరిపి శిక్ష విధించిన కోర్టు. మహిళల భద్రత విషయంలో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరుకు ఈ కేసు నిదర్శనం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇది చెంపపెట్టు.


తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో కాదా దేవిక (21 సం.లు., కూరాడ గ్రామం, కరప మండలం) అనే యువతిని పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ముద్దాయి గుబ్బల వెంకట సూర్యనారాయణ (27 సం.లు., బాలవరం గ్రామం, రంగంపేట మండలం)  అను నతను 08 .10 .2022 వ తేదీన ఉదయం 11.00 గంటల సమయంలో నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు. జరిగిన ఘటనపై మృతురాలి చిన్నాన్న గుత్తుల బాలాజి ఇచ్చిన ఫిర్యాదు పై  పెదపూడి పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 244 /2022 U/S  302 IPC  గా కేసును నమోదు చేసి స్థానికుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేసి  24 గంటలల్లో  రిమాండుకు తరలించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి కోర్టుకు 7 పని దినాలలోపే ఛార్జిషీట్ ను గౌరవ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. 


ఈ కేసులో నేరం జరిగిన నాటి నుండి జిల్లా ఎస్పీ  శ్రీ ఎం.రవీంద్రనాథ్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు అధికారికి విచారణ లో భాగంగా విలువైన  సలహాలు, సూచనలతో  నిర్ణీత సమయం లో రిపోర్టులు (పోస్టుమార్టం, రసాయనిక పరీక్షల రిపోర్టులు) మొదలగునవి రావడానికి సంబంధిత అధికారులను సంప్రదించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి  చేయించారు.

 

కాకినాడ లోని గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్ శ్రీమతి P.కమలాదేవి గారు ఈ కేసు విచారణను 09.01.2023 వ తేదీన ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కె. ఆదిత్య కుమార్ గారు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, వాద ప్రతివాదనలు విన్న అనంతరం ముద్దాయిపై నేర ఋజువైనందున ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈ రోజు 28-02-2023 వ తేదీన తీర్పునిచ్చారు.

Comments