ప్రగతి పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

 ప్రగతి పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం


అమరావతి,22 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రగతి కార్యక్రమం కింద అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులతో పాటు అమృత్ సరోవర్ కార్యక్రమం అమలు ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బుధవారం ఢిల్లీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో  వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ముఖ్యంగా వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి,నూతన రైల్వే లైన్ల నిర్మాణ పనులు,గ్యాస్ పైపులైన్ల పనులు,పలు ధర్మల్ పవర్ ప్రాజెక్టుల పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో సమీక్షించారు.అదే విధంగా అమృత్ సరోవర్ పధకం అమలు తీరును కూడా ప్రధాని సమీక్షించారు.s

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్,బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్,శ్యామల రావు,పిఆర్ అండ్ ఆర్డి కమీషనర్ కె.శశిధర్,ఇఎఫ్ఎస్టి ప్రత్యేక కార్యదర్శి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

  

Comments