వారంలోగా అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలి

 *వారంలోగా అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలి


*


*: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 20 (ప్రజా అమరావతి):


జిల్లాలో హౌసింగ్ లో ఇళ్ల నిర్మాణం, నాడు - నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణం, తదితర అభివృద్ధి పనుల్లో వారంలోగా పురోగతి చూపించాలని, పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ హెచ్చరించారు.


సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, నాడు-నేడు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, సచివాలయ సేవలు,  తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్, డిఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ కి సంబంధించి సామూహిక గృహప్రవేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా, జిల్లాకు సంబంధించి జగనన్న హౌసింగ్ లేఔట్ లలో 10,600 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం ఉందని, ఇప్పటివరకు 4,150 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మరో 6,450 ఇల్లు పూర్తి చేయాల్సి ఉందని, వెంటనే ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఇందులో 2,686 ఇల్లు బేస్మెంట్ స్థాయి నుంచి ఆర్ఎల్ స్థాయిలో ఉండగా, ఆర్ఎల్ నుంచి ఆర్సీ స్థాయిలో 1,654 ఇల్లు పూర్తి చేయాల్సి ఉందని, ఆర్సీ నుంచి పూర్తయ్య దశలో 2,110 ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని, వాటిని నిర్దేశించిన లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు అన్ని వివరాలు తెలుస్తూ ఉన్నాయని, అదే క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం అవగాహన లోపం ఉందని, దానిని వెంటనే సరిదిద్దుకోవాలని ఇళ్ల నిర్మాణాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వద్ద పూర్తి స్థాయిలో సమాచారం లేదని తాను గుర్తించడం జరిగిందని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వద్ద సమగ్ర వివరాలు సిద్ధంగా ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, తదితర ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి ఎక్కువ చోట్ల నిర్మాణాలు ఇంకా మొదలుపెట్టలేదని, ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదు తనకు సంజాయిషీ ఇవ్వాలని మడకశిర, పుట్టపర్తి, హిందూపురం, రాప్తాడు పంచాయతీ రాజ్ డిఈలను ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి 9 భవనాలు, 34 రైతు భరోసా కేంద్రాలు, 36 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలకు సంబంధించి పనులు కొన్ని చోట్ల మొదలు కాలేదని, మొదలుపెట్టిన చోట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. ఆయా భవన నిర్మాణాలకు సంబంధించి ఏజెన్సీ లతో ఏవైనా సమస్య ఉంటే వాటిని మార్చి మరొక ఏజెన్సీలకు ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలలో డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా కేటాయించిన ఇండికేటర్లకు సంబంధించి లక్ష్యాలలో పురోగతి చూపించాలన్నారు. అభివృద్ధి పనుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని, ఏజెన్సీలకు సంబంధించి నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సచివాలయాల్లో అందిస్తున్న ఏపీ సేవా సర్వీసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా సర్వీస్ లను సకాలంలో అందజేయాలన్నారు.


ఈ విసిలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ మురళీమోహన్, డిఈలు, మున్సిపల్ కమిషనర్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


-

Comments