శేరీదగ్గుమిల్లిలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రావి

 *- శేరీదగ్గుమిల్లిలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే రావి* 


 *- వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సాయం*


 గుడ్లవల్లేరు /గుడివాడ, ఫిబ్రవరి 25 (ప్రజా అమరావతి): గుడ్లవల్లేరు మండలం శేరీదగ్గుమిల్లి గ్రామంలో బాధిత కుటుంబానికి కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు అండగా నిలిచారు. గ్రామానికి చెందిన కొల్లూరి యోహాను ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నడవలేని పరిస్థితిలో ఉన్న యోహాను గురించి గ్రామ సర్పంచ్ జన్ను లక్ష్మీరాణి మాజీ ఎమ్మెల్యే రావికి తెలియజేశారు. వెంటనే స్పందించిన అయన మండల పార్టీ నేతలతో కలిసి శనివారం యోహానును పరామర్శించారు. కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. పదివేల ఆర్థిక సాయం అందజేశారు. యోహాను త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే రావి భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments