మాజీ ఎమ్మెల్యే రావి నాయకత్వంలో పెదలింగాలలో రచ్చబండ

 *- మాజీ ఎమ్మెల్యే రావి నాయకత్వంలో పెదలింగాలలో రచ్చబండ*


 *- ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనూహ్య స్పందన*

 *- ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటికీ అవగాహన*



గుడివాడ, ఫిబ్రవరి 11 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరావు నాయకత్వంలో నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా  శనివారం సాయంత్రం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రావి మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తోందన్నారు.

నందివాడ మండలం పెద లింగాల గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రభుత్వం పరిష్కరించని ప్రతి సమస్యను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పాలనను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను చంద్రబాబుకు వివరించానని తెలిపారు. గుడివాడ పట్టణంలోని నాగవరప్పాడు కాలువ గట్టుపై నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. అక్రమంగా కేసులు పెట్టినా టిడిపి శ్రేణుల సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నానని తెలిపారు. అక్రమ కేసుల వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి మరింతగా అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఈ పాదయాత్రపై యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే రావి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, నాయకులు కొల్లి పెదబాబు, తాతినేని మురళి, కగ్గా రామారావు, రాంబాబు, భద్ర రావు, యలమంచిలి సతీష్, కాకరాల సురేష్, నంబూరు రాకేష్, సిహెచ్ రవి, పి సాల్మన్, నిర్మల్, లక్ష్మణరావు, అరిపిరాల సాల్మన్, వీర్ల శివ తదితరులు పాల్గొన్నారు.

Comments