ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ను అడగటమే రైతులు చేసిన తప్పా?

 అమరావతి (ప్రజా అమరావతి);

14 మంది రైతులపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 


ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ను అడగటమే రైతులు చేసిన తప్పా?


రైతుల పెట్టిన కేసు వెనక్కి తీసుకోకుంటే, రైతుల పక్షాన పోరాడతాము.


భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


- మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు


పార్వతీపురం వీరఘట్టం మండలం చలివెంద్రిలో 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటూ మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ని ధాన్యం రైతులు అడ్డుకుని సమస్యను పరిష్కరించాలని అడిగినందుకు 14 మంది రైతులపై కేసు పెట్టడం సరైన చర్య కాదని, అధికారులు, జగన్ రెడ్డి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. 


రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేయకుండానే లక్ష్యం అయిపోయిందని చెప్పడం ప్రభుత్వ వైఫల్యం. 


ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపిన రైతులపై కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురిచేయడం సరైన చర్య కాదు. 


ఇప్పటికే అమరావతి రాజధాని కోసం పోరాడిన దళిత, బీసీ రైతులకు బేడీలు వేసి అవమానించిన ఘటనలో దేశం దృష్ఠిలో జగన్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులపై ఉన్న గౌరవం పోగొట్టుకున్నారు. ఇప్పుడు రైతులు తమ సమస్యలను జిల్లా ఉన్నత అధికారికి చెప్పుకోడానికి వచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం అనేది ఈ ప్రభుత్వ చర్యకు పరాకాష్టకు చేరింది. 


రైతుల ఆందోళనలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. పెట్టిన కేసు వెనక్కి తీసుకోకుంటే, రైతుల పక్షాన పోరాడతాము.


మళ్ళీ రైతుల విషయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే భవిష్యత్తులో జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Comments