రైతన్నలకు అందుబాటులో "మార్కెట్ యార్డ్" ఉండాలి... ఎమ్మెల్యే ఆర్కే

 *రైతన్నలకు అందుబాటులో "మార్కెట్ యార్డ్" ఉండాలి... ఎమ్మెల్యే ఆర్కే*


   మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి మునగాల భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. సమావేశంలో రైతుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే గత సమావేశంలో తీర్మానించిన ప్రతిపాదించిన పనులు ఎంతవరకు పూర్తి చేశారని యాడ్ సెక్రెటరీని ప్రశ్నించారు. అదే విధంగా ఎమ్మెల్యే సమావేశంలో కొన్ని సూచనలు చేశారు. రైతన్నలకు మార్కెట్ యార్డ్ అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు యార్డు తైవాన్ స్పెయర్లు కొనుగోలు చేసి లాభం లేకుండా రైతులకు అద్దెకివ్వలన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, అయితే మార్కెట్లో రైతులు గోతాలను అధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారని, మార్కెట్ యార్డు ఆ గోతాలను కొనుగోలు చేసి రైతులకు లాభం లేకుండా అందజేయాలన్నారు. రైతులు పండించిన పంటను ఆరబోసుకోవడానికి పట్టాలను కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. వేసవి కాలంలో మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో పలుచోట్ల ప్రజలకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ యార్డ్ కి ఆదాయం పెరిగే విధంగా పాలకవర్గం మార్గాలను అన్వేషించాలన్నారు. 


ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఆలూరి రాజ్యం, బాపనపల్లి అన్నపూర్ణ, పాటిబండ్ల కుమారి, మాణిక్యాల శ్రీలక్ష్మి, బోనం శివకుమారి, బుర్రముక్కు భారతీయదేవి, దాసరి ఇస్సాకమ్మ, ఉద్యాన శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు శైలజరాణి, యార్డ్ కార్యదర్శి ఎస్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments