న్యూ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో మార్కెటింగ్‌ టై అప్‌ విధానంపై దృష్టి సారించాలన్న సీఎం.


అమరావతి (ప్రజా అమరావతి);


*నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై క్యాంపు కార్యాలయంలో పరిశ్రామలశాఖతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.*

*నూతన పారిశ్రామిక విధానంపై ప్రాధమిక సమావేశం.*

*పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్‌ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలన్న  సీఎం.

న్యూ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీలో మార్కెటింగ్‌ టై అప్‌ విధానంపై దృష్టి సారించాలన్న సీఎం.


అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ టైఅప్‌ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతామన్న సీఎం.

ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్‌ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్న సీఎం.

కాన్సెప్ట్‌ నుంచి కమిషనింగ్‌ మొదలుకుని మార్కెటింగ్‌ వరకు హేండ్‌ హోల్డింగ్‌గా ఉండాలన్న సీఎం.

అడ్వైజ్, అసిస్ట్‌ అండ్‌ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ  పాలసీ ఉండాలన్న సీఎం.

స్టార్టప్‌ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం. 

విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్‌ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలన్న సీఎం.

మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలన్న సీఎం.

అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలన్న సీఎం.

స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలన్న సీఎం.

పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పనదిశగా దృష్టిసారించాలన్న సీఎం.

ఈ  అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలన్న సీఎం. 


ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ కార్యదర్శులు కే వీ వీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments