ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలి

 

విజయవాడ (ప్రజా అమరావతి);

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు కృష్ణా జిల్లా ,గొల్లనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల భౌతిక వనరులను జగనన్న గోరుముద్ద,జగనన్న విద్యా కానుక, అమ్మవడితో పాటు మొదలైన పథకాల వినియోగాన్ని లబ్ధిదారులైన విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిస్పందనను తెలుసుకున్నారు.  8వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం ఇచ్చిన బైజూస్ కంటెంట్ ట్యాబ్ ల వినియోగం పై వారి అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. నాడు నేడు తో పాఠశాలకు సమకూర్చబడిన భౌతిక వనరులను విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాల


ని ఆకాంక్షించారు. హర్ష ఫౌండేషన్ ద్వారా అకడమిక్ అచీవ్ మెంట్ ప్రోత్సాహకాలను అందజేశారు.బాలోత్సవంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని పనితీరుని అభినందిస్తూ వారిని దుశ్శాలువతో సత్కరించారు.


ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఎం.బాలగంగాధర్ తిలక్, విశ్రాంత అధ్యాపకులు గన్నె వెంకట్రావు, స్రవంతి ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్  కొమ్మినేని రామకృష్ణ, సాయి శ్రీనివాస ప్రిన్సిపల్ రాజులపాటి దుర్గారావు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments