బడులలో విద్యా ప్రమాణాలు మరింత పెరగాలి
పనితీరు మార్చుకోవాలి*
రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్*
మడకశిర, గుడిబండ మండలంలో బూదిపల్లి, మోర్ బాగల్ ఉన్నత పాఠశాలలను పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి*
మడకశిర, ఫిబ్రవరి 4 (ప్రజా అమరావతి):
జిల్లాలో ఎన్ని పాఠశాలల్లో నాడు- నేడు కింద నిర్మిస్తున్న మరుగుదొడ్లు, యూరినల్స్ తదితర వివరాలు తెలియజేయకపోవడం పట్ల సంబంధిత శాఖల అధికారుల పనితీరు బాగాలేదని, పనితీరు మార్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మడకశిర నియోజకవర్గంలో మడకశిర, గుడిబండ మండలంలో బూదిపల్లి, మోర్ బాగల్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. నాడు నేడు పనులతో పాటు విద్యా బోధన, విద్యార్థుల సౌకర్యాలు, ఉపాధ్యాయులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్రంగా తనిఖీ చేశారు.*
*ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తొలుత ఉపాధ్యాయులకు అదనంగా 2500 ఇస్తున్న ప్రోత్సాహక నగదు విషయాన్ని ఉపాధ్యాయులకు సమాచారం అందించకపోవడం పట్ల డిఇఓ, ఉప విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ముగ్గురిపై మండిపడ్డారు. అదేవిధంగా పాఠశాలల్లో ఏ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టును బోధిస్తున్నారు, వారంలో ఎన్ని పీరియడ్లు ఉంటాయి, తరగతి టీచర్ ఎవరు తదితర అంశాలపై ప్రశ్నించడమే కాకుండా పనిచేసిన ఉపాధ్యాయులకు అభినందిస్తూ.. మరోవైపు పనిచేయని వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముగ్గురు అధికారులకు మెమో జారీ చేయాలని రీజినల్ డైరెక్టర్ ను ఆదేశించారు. అలాగే నాడు -నేడు పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నాడు - నేడు పనుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సూచిస్తే ఏపీ ఐడబ్ల్యుసి శాఖ వారు, పంచాయతీరాజ్ శాఖ వారు పర్యవేక్షణ లేక పొగ జిల్లాలో ఎన్ని పాఠశాలల్లో నాడు నేడు కింద నిర్మిస్తున్న మరుగుదొడ్లు, యూరినల్స్ తదితర వివరాలు తెలియజేయకపోవడం పట్ల మీ యొక్క పనితీరు బాగాలేదని, మార్చుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని హెచ్చరించారు. విద్యార్థులతో ఎంతవరకు బోధన జరిగింది అన్న విషయంపై కూడా ఆరా తీసి ఇంగ్లీష్ వర్క్ బుక్ లో విద్యార్థుల యొక్క పురోగతి అందులో కనిపించడంతో స్వయంగా ఆ ఉపాధ్యాయురాలి శోభారాణికి క్లాప్స్ కొట్టండి అంటూ విద్యార్థుల చేత క్లాప్స్ కొట్టించారు. జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి కి పెనుగొండ విద్యా శాఖ అధికారి రంగస్వామికి ఉపాధ్యాయుల యొక్క పనితీరుపై పర్యవేక్షించాలని సూచించారు. విద్యాబోధనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో పిల్లలకు విద్యాబుద్ధులు అందజేయడం జరుగుతూ ఉందని తెలిపారు పోటీ ప్రపంచానికి దీటుగా పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ట్యాబ్ లపై విద్యార్థులకు ఉపాధ్యాయుల తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎంతో ఖరీదైన ట్యాబ్ లోని కంటైనెంట్ వినియోగించుకుంటే విద్యార్థులు గొప్ప మార్పు వస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆర్ జి డి, ప్రతాపరెడ్డి, డిఈఓ మీనాక్షి , సంబంధిత అధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment