బాల కార్మికులు , వెట్టి చాకిరీ రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చి దిద్దుదాం..

 బాల కార్మికులు , వెట్టి చాకిరీ రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చి దిద్దుదాం..


........ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు.

               

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ ను నిర్మూలించి బాలల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు తెలిపారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్ట సమీపంలో వెంకటపాలెం సమీపంలో గల డాన్ బొస్కో నవజీవన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించ బడుచున్న చిగురు చిల్డ్రన్ విలేజె ను జిల్లా బాలల సంక్షేమ సమితి వారితో కలిసి సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీన  ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ వారు ప్రారంభించిన 

ఆపరేషన్ స్వేచ్చ కార్యక్రమంలో  భాగంగా రాష్ట్రంలో అన్ని  జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారులు  బాలకార్మికులు, వెట్టి చాకిరి చేస్తున్న బాలలును గుర్తించి  విముక్త పరిచి వారిని తిరిగి పాటశాలల్లో మరియు బాలల పునరావాస కేంద్రాలలో  ప్రవేశం కల్పించే చర్యలును ఈ నెల 15 వ తేదీ వరుకు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలో గల ఇటుక బట్టీలు,క్వారీలు,షాపులు,డాబాలు  మొదలగు ప్రమాద భరిత రంగాలు, కేంద్రాల్లో పనిచేస్తున్న కొంతమంది బాల కార్మికులును గుర్తించి చిగురు బాలల సంరక్షణ కేంద్రంలో అధికారులు  చేర్పించిన నేపద్యంలో వారితో కమిషన్ చైర్ పర్సన్ సమావేశమై చర్చించారు.

బాలకార్మిక వ్యవస్థ వలన బాలల యొక్క భవిష్యత్ అంధకారంలోకి నెట్టవేయబడుచున్నధని, విథ్యా మరియు ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

 వెట్టి చాకిరి అనగా అప్పు తీసుకొన్న వ్యక్తి, ఆ అప్పు తీర్చలేక పోయినపుడు ఆ దళారి,యజమాని వద్ద కొంత కాలం పాటు పనిచేయడానికి అవసరమైన నగదు లేదా వస్తు రూపంలో తీసుకొని అగ్రిమెంట్ పత్రాలు సమర్పిస్తారు..దీనివలన బాలలు ఆత్మ స్థైర్యం కోల్పోయి శారీరకంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని ,కొంతమంది దళారులు ఈ బాలలతో అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించు కుంటున్నారని,

ఇటువంటి వ్యవస్థను మరింతగా పూర్తి స్థాయి లో నిర్మూలించడానికి  అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకొని వీటికోసం రూపొందించబడిన చట్టాలను.  కఠీన తరంగా  అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షరాలు ప్రమీల,సభ్యురాలు

రత్న కుమారి, డీ పీ ఓ 

సత్యనారాయణ,  బచపన్ బచావో ఆందోళన్ రాష్ట్ర ప్రతినిధి జీ.తిరుపతి రావు, జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిదిలు అనిల్, విజయ్ కుమార్,చిగురు సిబ్బంది అనిల్,రమ్య పాల్గొన్నారు.

Comments