మరో రుషికొండగా మారిన కమ్మరాయ గుట్ట

 *మరో రుషికొండగా మారిన కమ్మరాయ గుట్ట


*

*వైసిపి దొంగల చేతివాటంతో కరిగిపోయిన కొండ*

*యువగళం పాదయాత్రలో పరిశీలించిన లోకేష్*

జిడి నెల్లూరు (ప్రజా అమరావతి): చుట్టూ పచ్చటి పొలాలు, వాగులు, సెలయేర్లు మధ్యలో ఎత్తుగా ఉంటూ చిత్తూరు - పుత్తూరు ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారుల కనువిందు చేస్తున్న కమ్మరాయ గుట్టను టిడిపి యువనేత నారా లోకేష్ పరిశీలించారు. వైసిపి దొంగల చేతివాటంతో జిడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కమ్మరాయగుట్ట కొండ కరిగిపోతోంది. కొందరు వైసిపికి చెందిన అక్రమార్కులు అడ్డగోలు తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతూ అడ్డంగా దోచుకుంటున్నారు. సుందరమైన కొండ కనుమరుగమవుతోందంటూ సమీప గ్రామాల ప్రజలు  లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తాము కమ్మరాయగుట్ట విషయంలో ఆందోళనకు దిగిన విషయాన్ని స్థానిక టిడిపి నేతలు ఈ సందర్భంగా లోకేష్ కు తెలిపారు.  చిత్తూరు నుంచి తచ్చూరు వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కాయి. జాతీయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన గుత్తేదారు సంస్థ... నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ కోసం స్థానిక అధికార పార్టీ నేతలను ఆశ్రయించింది. ప్రభుత్వ సంపదను కొల్లగొట్టే విషయంలో నిష్ణాతులైన వైసిపి నేతలు కమ్మరాయగుట్టను కరిగిస్తూ... అందినంత దోచుకుంటున్నారు. రహదారిపై పరిచే కంకర నుంచి వాటిపై వేసే మట్టివరకు వైసిపి కీలక నేతల కనుసన్నల్లోనే సాగుతున్న విషయాన్ని స్థానిక నేతలు లోకేష్ దృష్టికి తెచ్చారు. కమ్మరాయగుట్ట వద్ద తవ్వకాలకు  ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. 45కిలోమీటర్ల రహదారికి అవసరమైన కంకర, గ్రావెల్ తవ్వకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందన్నారు. రాష్ట్రంలో వైసిపినేతల దోపిడీకి ఇదొక నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు.

Comments