మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు "కేర్ కంపానియన్ ప్రోగ్రాం"

 


*మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు "కేర్ కంపానియన్ ప్రోగ్రాం"*



*యోస్ఎయిడ్ (YosAid) సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ*


మంగళగిరి, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి): తల్లీ బిడ్డ(నవజాత శిశువు)ల ఆరోగ్య పరిరక్షణ కోసం రూపొందించిన" కేర్ కంపానియన్ ప్రోగ్రాం" అనే కార్యక్రమాన్న అమలు చేసేందుకు యోస్ ఎయిడ్ ఫౌండేషన్,బెంగళూరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అవగాహనా పత్రం(ఎంవోయూ) కుదుర్చుకుంది.  ఈ అవగాహనా పత్రంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీ జె.నివాస్, సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. అడిషనల్ డైరెక్టర్ (ఆర్ సిహెచ్ ) డాక్టర్ కెవిఎన్ఎస్ అనిల్ కుమార్,  జాయింట్ డైరెక్టర్(చైల్డ్ హెల్త్&ఇమ్యూనైజేషన్) డాక్టర్ అర్జునరావు, సంస్థ ప్రతినిదులు పాల్గొన్నారు. యోస్ ఎయిడ్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో తల్లీ, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేర్ కంపానియన్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ తెలిపారు. దీనిని రాష్ట్రంలోని వివిధ జిల్లా, బోధనా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లులు, కుటుంబ సభ్యులు, వారి సంరక్షకులకు అవసరమైన వైద్య నైపుణ్యాన్ని అందించటం ద్వారా తల్లీ, నవజాత శిశువులు త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుందన్నారు. కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ లో భాగంగా గర్భిణుల (ANC), బాలింతల (PNC), నవజాత శిశువుల (SNCU/NBSU) వార్డులలోని స్టాఫ్ నర్సు లు, కౌన్సెలర్లు, మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొ వైడర్ల యొక్క నైపుణ్యా లను తగిన శిక్షణలతో మెరుగుపరుస్తామని తెలిపారు.  ఈ శిక్షణ పొందిన వార్డ్ స్టాఫ్ తో OPD లను శిక్షణ తరగతి గదులుగా ఉపయోగించుకుంటూ గర్భిణులకు (ANC), బాలింతలు(PNC), నవజాత శిశువుల సంరక్షకులకు సరళమైన మరియు ఇంటరాక్టివ్ పద్ధతిలో వైద్య నైపుణ్యాన్ని పెంచడం తో పాటుగా MCCS/Whatsapp ఉపయోగించి సమాచారం ఎలా తెలుసుకోవాలో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తిగల తల్లులు, కుటుంబ సభ్యు లకు MCCS/Whatsapp లలో సమాచారాన్ని అందించడం ద్వా రా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్నారు. కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్య వ్యవస్థలు, స్టాఫ్ మరియు తల్లుల పైన విస్తృతంగా ప్రభావం చూపే సరళమైన, ప్రభావవంతమైన కార్యక్రమం అని ఆయన వివరించారు. ఈ శిక్షణ కేవలం తల్లులకు మాత్రమే కాకుండా గర్భిణుల, బాలింతల, నవజాత శిశువుల సంరక్షణలో భాగమైన తండ్రులు, అమ్మమ్మలు మరియు ఇతర బంధువులను లక్ష్యంగా చేసుకొని

రూపొందించబడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్దతతో, విస్తృత ప్రయత్నా లలో భాగంగా తల్లులు మరియు నవజాత శిశువుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి,  కుటుంబాలన్నీ ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన

మద్దతు మరియు సంరక్షణను పొందేలా కేర్ కంపానియన్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందన్నారు.

*ఎంఎల్ హెచ్ పిలకు మరింత శిక్షణ అవసరం౼ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు*

అవగాహనా పత్రంపై సంతకాల కార్యక్రమానికి ముందు యోస్ ఎయిడ్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబును కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించారు.  రాష్ట్రంలో కమ్యూనిటీ స్థాయి ఆరోగ్య సేవలపై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రధానంగా ద్రుష్టి సారించినందున ప్రతి మూడు జిల్లాలకు చెందిన సామాజిక ఆరోగ్యాధికారులు (సిహెచ్ఓ)కు  ఈ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందని క్రిష్ణబాబు వారికి సూచించారు.  ఈ క్రుషి ద్వారా  గ్రామస్థాయిలో సమర్ధవంతమైన వైద్య సేవలందించేందుకు ప్రారంభించిన ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమాన్ని మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  అసాంక్రమిక వ్యాధుల(ఎన్ సిడి)పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు.  వ్యాధులు సోకిన తరువాత కట్టడి చేయటం కన్నా వ్యాధి నిరోధానికి చర్యలు తీసుకోవటం అత్యంత ప్రధానమని ఆయన అన్నారు.  వాకింగ్ , జాగింగ్ , వ్యాయామం వంటి శారీరక శ్రమ  ద్వారా ఎన్ సిడిలను కట్టడిచేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రుష్టి సారించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 


Comments