నెల్లూరు (ప్రజా అమరావతి);
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా వుంటూ సమగ్ర అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని రామదాసు కండ్రిగ గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వివిధ పధకాల కింద వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.
అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్నీ నియోజక వర్గాల్లో వినూత్నంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు ఆర్ధిక చేయుత అందించేందుకు ఫిబ్రవరి, మార్చి నెలలో వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెల్పడం జరిగిందని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉగాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నియోజక వర్గంలోని అన్నీ గ్రామాల సంపూర్ణ అభివృద్ది, ప్రజల సంక్షేమమే ధ్యేయంతో పనిచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment