కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు
కొవ్వూరు (ప్రజా అమరావతి): ** కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు ** మహాశివరాత్రి రోజున ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది


** భక్తులు పోలీస్ అధికారులు, నిర్వాహకుల సూచనలు పాటించాలి


-  ఆర్డీఓ, ఎస్. మల్లి బాబు.


కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో నేడు (శనివారం)  జరుపుకోనున్న మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లను అత్యంత పకడ్బందీ చేపట్టడం జరుగుతోందని  ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు.  


  శుక్రవారం సాయంత్రం స్థానిక గోష్పాద కేంద్రం సమీపంలో ఘాట్స్ వద్ద ఆలయ నిర్వాహకులు, కొవ్వూరు మునిసిపాలిటి ఆధ్వర్యంలో  మహాశివరాత్రి  ఏర్పాట్లు ను  సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.   ఈ సందర్బంగా ఆర్డీఓ ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎక్కడికక్కడ బారికెట్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలీసు అధికారుల, వాలంటీర్ల సూచనలను అనుసరించి సహకరించాలని భక్తులకు ఆర్డీవో మల్లి బాబు విజ్ఞప్తి చేశారు. భక్తులకు  సౌకర్యార్ధం స్నాన ఘట్టముల యందు, మరియు ఆలయ దర్శనం కోసం బారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా క్యూ లైన్స్ ఏర్పాటు చేశార న్నారు. గజ ఈతగాళ్లు, అవసరమైన బోట్ సిబ్బంది అందుబాటులో ఉంచడం ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు.


ఎటువంటి ఘటనలు జరుగకుండా  ఆలయ ప్రాంగణము నందు, స్నాన ఘట్టముల వద్ద పోలీస్, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్ ల ద్వారా బందోబస్తు ఏర్పాటు  చేశామన్నారు.  బందోబస్త్ ఏర్పాట్లు నిర్ణీత పాయింట్ల వద్ద పోలీస్ పాయింట్స్ వద్ద సిబ్బందిని నియమించాలని  డి.ఎస్పి వి.ఎస్.వి. వర్మ కి తెలియచేశారు. 


గోష్పాద క్షేత్ర పరిసర ప్రాంతము నందు భక్తుల కొరకు ప్రధమ చికిత్సా కేంద్రము, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. 


 భక్తులు స్నానములు ఆచరించుటకు అనువుగా స్నానాల రేవు యందు ఇసుక మేటలు, ఘాట్లను పరిశుభ్రముగా మునిసిపల్ సిబ్బంది  నిర్వహణ బాధ్యతను కమిషనర్ బి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు.


 ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ బి. శ్రీకాంత్, డిఎస్పీ వి.ఎస్.వి. వర్మ, 

మండల తాహసీల్దార్ బి. నాగరాజు నాయక్, ఏ. డి. ఈ, పి. అచ్యు తాచారి, ఏ ఈ, ఎ. జి. ఆర్. బి., ఆర్. సునీల్ బాబు, దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరు లు పాల్గొన్నారు.Comments