కొత్తవలస హాస్టల్ ని సందర్శించిన కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కొత్తవలస, విజయనగరం, ఫిబ్రవరి 08 (ప్రజా అమరావతి):
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి బుధవారం రాత్రి, కొత్తవలస బిసి బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో ఆమె హాస్టల్ కి వచ్చారు. బాలికలతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. మంగళవారం అస్వస్థతకు గురి అయి చికిత్స పొందిన బాలికలతో మాట్లాడారు. వారి అగోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి సమస్యలపై ప్రశ్నించారు. బాగా చదువుకోవాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు పాల్గొన్నారు.
addComments
Post a Comment