*కోనేరులో దొరికిన నిధులు అమ్ముకోవడానికే నెలకొకసారి ఆర్కే మహారాష్ట్ర టూర్ ...?*
మంగళగిరి (ప్రజా అమరావతి);
*అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దమ్ములేక అశుద్ధపు మాటలు మాట్లాడుతున్నారు*
*కోనేరు లో మీరు చెప్పిన అశుద్ధపు మట్టి నాలుగుకాళ్ళ మండపాని కా, సిగ్గు మాలిన చర్య*
- తమ్మిశెట్టి జానకి దేవి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి
కోటిన్నర నిధులతో కోనేరు పునః నిర్మాణ పనులు జరుగుతుంటే సీసీటీవీలు ఎందుకు పెట్టలేదు అని మేము ప్రశ్నిస్తే సమాధానం దాటవేసే విధంగా మాట్లాడుతున్నారని మంగళవారం నియోజకవర్గ టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తమ్మిశెట్టి జానకి దేవి వాపోయారు
పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఎందుకు పనులు జరగటం లేదు,పురావస్తు శాఖా పర్యవేక్షణ ఉంటే భారీ క్రేన్లు కోనేరులో దిగేవా అని ప్రశ్నించారు
మున్సిపల్ కార్మికులు కోనేరులో ఎందుకు పనిచేయవలసి వచ్చిందో తెలుపాలన్నారు
రెండు నెలలుగా కోనేరు వద్ద పనులు జరుగుతా ఉంటే కరెంట్ బిల్లులు దేవాలయం చెల్లించుట వెనక ఆంతర్యం ఏమిటో తెలుపాలన్నారు
అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దమ్ము లేక ఆర్కే తప్పించుకుని తిరుగుతున్నారని తెలియజేశారు
వైసీపీ నాయకులు,సంబంధం లేని విధంగా దేవస్థానానికి అపచారం చేసే విధంగా వాడకూడని పదాలు వాడి దిగజారి మాట్లాడుతున్నారని వాపోయారు
కోనేరులో దొరికిన నిధులు అమ్ముకోవడానికి, బినామీ కాంట్రాక్టుల రూపంలో దోచిన ధనాన్ని దాచుకోవటానికే ఎమ్మెల్యే ఆర్కే నెలకొకసారి మహారాష్ట్ర టూర్ వెళుతున్నారని సందేహం వ్యక్తం చేశారు
వైసిపి నాయకులు వారు చెప్పిన విధంగా కోనేరులో తీసిన అశుద్ధపు మట్టి నాలుగు కాళ్ల మండపానికి తరలిండం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
addComments
Post a Comment